Google Pay నియమాల అనుబంధ డాక్యుమెంట్: భారతదేశ ప్రవాసుల కోసం Google Pay సర్వీస్ నియమాలు

భారతదేశ నివాసుల కోసం Google Pay సర్వీస్ నియమాలు

చివరిగా అప్‌డేట్ చేసినది: డిసెంబర్ 11, 2024

1. పరిచయం

వర్తించే నియమాలు. Google Payని ఉపయోగించినందుకు ధన్యవాదాలు. Google Pay ఆఫర్‌ల (కింద నిర్వచించబడిన) సంయుక్త నియమాల ప్రయోజనాల కోసం, "Google Pay" అనేది భారతదేశంలో నివసించే యూజర్‌లకు Google India Digital Services Private Limited ద్వారా 5th floor, DLF Centre, Block 124, Narindra Place, Sansad Marg, New Delhi - 110001 వద్ద రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్‌తో అందించబడే సర్వీసు ("Google"), గతంలో దీనిని Tez అని పిలిచేవారు. Google Payని యాక్సెస్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం లేదా ఉపయోగించడం ద్వారా, మీరు కింది వాటిని పాటించడానికి, కట్టుబడి ఉండటానికి అంగీకరిస్తున్నారు:

  1. Google సర్వీస్ నియమాలు ("సార్వత్రిక నిబంధనలు");
  2. భారతదేశ నివాసుల కోసం ఈ Google Pay సర్వీస్ నియమాలు ("Google Pay నియమాలు");
  3. Google గోప్యతా పాలసీ ("గోప్యతా పాలసీ");
  4. Google Pay పాలసీలు ("Google Pay పాలసీలు");
  5. Google Pay ఆఫర్ సర్వీస్ నియమాలు ("సాధారణ Google Pay ఆఫర్‌ల నియమాలు"); అలాగే
  6. Google Pay ఫిర్యాదుల నిర్వహణ పాలసీ ("ఫిర్యాదుల నిర్వహణ పాలసీ").

ఈ ఆరు డాక్యుమెంట్‌లు ఇక్కడ సమిష్టిగా "Google Pay ఆఫర్‌ల సంయుక్త నియమాలు"గా సూచించబడ్డాయి.

మీ చట్టపరమైన హక్కులు, నివారణోపాయాలు, అనివార్యకార్యాల గురించిన ముఖ్యమైన సమాచారాన్ని కలిగి ఉన్నందున సార్వత్రిక నిబంధనలతో ప్రారంభించి Google Pay ఆఫర్‌ల సంయుక్త నియమాలను దయచేసి, జాగ్రత్తగా చదవండి. ఈ Google Pay ఆఫర్‌ల సంయుక్త నియమాలు అనేవి Google Pay సర్వీసులకు (ఇక్కడ నిర్వచించినట్లుగా) మీ యాక్సెస్‌ను, వినియోగాన్ని నిర్దేశించే చట్టబద్ధమైన అనివార్య ఒప్పందాన్ని మీకు Googleకు మధ్య రూపొందిస్తాయి. మీకు ఈ డాక్యుమెంట్‌లు అర్థం కాకపోయినా లేదా వాటిలో ఏదైనా భాగాన్ని అంగీకరించకపోయినా, మీరు Google Pay సర్వీసులను ఉపయోగించకూడదు. Google Payలో ఈ సర్వీసులు క్రమంగా అందించబడవచ్చని, ఈ Google Pay ఆఫర్‌ల సంయుక్త నియమాలు తదనుగుణంగా వర్తిస్తాయని మీరు అర్థం చేసుకున్నారు.

Google గ్రూప్ కంపెనీల వినియోగం. Google తరపున మీకు Google Pay సర్వీసులలో దేనినైనా అందించడానికి దాని గ్రూప్ కంపెనీల సర్వీసులను (ఇందులో నిర్వచించినట్లుగా) ఉపయోగించుకునే హక్కు Googleకు ఉందని మీరు అర్థం చేసుకుని, దీని ద్వారా అంగీకరిస్తున్నారు.

ఈ Google Pay ఆఫర్‌ల సంయుక్త నియమాలలోని దేనినైనా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే హక్కు Googleకు ఉందని మీరు మరింత అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. మీరు అప్‌డేట్ అయ్యి ఉంటున్నారని, Google Pay ఆఫర్‌ల సంయుక్త నియమాలను తరచుగా చదువుతున్నారని నిర్ధారించుకోవాలి. ఒకవేళ Google Pay సర్వీస్ నియమాలకు, సార్వత్రిక నిబంధనలకు మధ్య ఏదైనా వైరుధ్యం ఉంటే, ఈ Google Pay సర్వీస్ నియమాలు అమలవుతాయి.

Google Pay ఆఫర్‌ల సంయుక్త నియమాలను అంగీకరించడం ద్వారా, మీరు ఈ కింది వాటికి ప్రాతినిధ్యం వహించి హామీ ఇస్తున్నారు:

  • మీ వయస్సు తప్పనిసరిగా 18 లేదా అంత కంటే ఎక్కువ ఉండాలి;
  • మీరు చట్టబద్ధంగా అనివార్య ఒప్పందంలోకి ప్రవేశించడానికి సమర్థులు; అలాగే
  • మీరు భారతదేశ చట్టాల ప్రకారం Google Payని యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం నుండి గాని మరే విధంగా గాని చట్టపరంగా నిషేధించబడలేదు.

తల్లి/తండ్రి లేదా లీగల్ గార్డియన్ అనుమతి. మీరు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే (“టీనేజర్(లు)”), Google Payని ఉపయోగించడానికి మీకు మీ తల్లి/తండ్రి లేదా లీగల్ గార్డియన్ అనుమతి ఉందని మీరు వాగ్దానం చేస్తున్నారు. దయచేసి వారు మీతో కలిసి సంయుక్త Google Pay నియమాలను చదివి, అంగీకరించేలా చేయండి.

మీరు ఒకవేళ టీనేజర్‌కు తల్లి/తండ్రి లేదా లీగల్ గార్డియన్ అయితే, Google Pay వినియోగానికి టీనేజర్‌ను అనుమతించడం ద్వారా, మీరు సంయుక్త Google Pay నియమాల నిబంధనలకు లోబడి ఉంటారు, Google Payలో మీ టీనేజర్ యాక్టివిటీకి బాధ్యత వహిస్తారు. అందువల్ల, టీనేజర్ తరపున వారి తల్లి/తండ్రి లేదా లీగల్ గార్డియన్ సంయుక్త Google Pay నియమాలకు అంగీకరిస్తే తప్ప, టీనేజర్‌లు Google Payని ఉపయోగించలేరు.

థర్డ్-పార్టీ నియమాలు, షరతులు. Google Payలో మీకు థర్డ్-పార్టీ ప్రోడక్ట్‌లను లేదా సర్వీసులను అందించడానికి Google సౌకర్యాన్ని కల్పించవచ్చు. ఈ థర్డ్-పార్టీ ప్రోడక్ట్‌లను లేదా సర్వీసులను ఉపయోగించడానికి, మీరు అదనపు నియమాలను, షరతులను అంగీకరించాలి, అదనపు ఆవశ్యకతలను పూర్తి చేయవలసి ఉంటుంది.

2. నిర్వచనాలు

ఈ Google Pay నియమాలలో కనిపించే నిర్వచనాలు:

"వర్తించే చట్టం" అంటే అన్ని వర్తించే చట్టాలు, నియమాలు, నిబంధనలు, గైడ్‌లైన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు, పేమెంట్ పార్టిసిపెంట్ నియమాలతో సహా చట్టబద్ధమైన లేదా ప్రభుత్వ నోటిఫికేషన్‌లు.

"BBPOU" అంటే వర్తించే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ కింద పనిచేసే భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్.

"బిల్లర్" అంటే బిల్లర్ అగ్రిగేటర్ లేదా BBPOU ద్వారా బిల్ పేమెంట్ సర్వీసులకు Google Pay సపోర్ట్ చేసే ప్రీపెయిడ్ సర్వీస్ ప్రొవైడర్‌లతో సహా బిల్లర్ అని అర్థం, వారికి యూజర్ Google Payలో బిల్లు పేమెంట్‌ను ప్రారంభించగలరు.

"బిల్ పేమెంట్ సర్వీసులు" అంటే Google Payలో బిల్లులు లేదా ప్రీపెయిడ్ ప్లాన్‌లను చూడడానికి, బిల్లర్‌లకు పేమెంట్‌లు చేయడానికి, ఇతర అనుబంధ సర్వీసులను స్వీకరించడానికి యూజర్‌లకు అందించబడిన సదుపాయం.

క్రెడిట్ కార్డ్” అంటే క్రెడిట్ సంస్థతో మీ ఒప్పందం ప్రకారం మీకు క్రెడిట్ సంస్థ అందించే ఏదైనా క్రెడిట్ కార్డ్.

క్రెడిట్ కార్డ్ సర్వీసులు” అంటే మీకు క్రెడిట్ సంస్థలు ఆఫ‌ర్ చేసే క్రెడిట్ కార్డ్‌ల కోసం అప్ల‌యి చేసుకోవ‌డం, కార్డుల‌ను మేనేజ్ చేయ‌డం, కార్డుల‌కు సంబంధించిన ఆఫ‌ర్ల‌ను, స‌ర్వీస్‌ల‌ను పొంద‌డం వంటి Google Pay ద్వారా అందే స‌ర్వీస్‌లు.

క్రెడిట్ సమాచారం” మీ క్రెడిట్ స్కోర్, మీ క్రెడిట్ సమాచార రిపోర్ట్ వంటి మీ క్రెడిట్‌కు సంబంధించిన ఏదైనా నిర్దిష్ట సమాచారం.

“క్రెడిట్ సమాచార రిపోర్ట్” అనేది TUCIBIL ద్వారా జెనరేట్ చేయబడిన రిపోర్ట్, దీనిని మీరు GPayలో చూస్తారు.

"క్రెడిట్ సంస్థలు" అంటే బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు, యూజర్‌లకు అడ్వాన్సులు, లోన్‌లను అందించడానికి వర్తించే నియంత్రణ సంస్థ అధికారుల నుండి అవసరమైన అనుమతులను కలిగి ఉన్న ఇతర క్రెడిట్ ప్రొవైడర్‌లు.

"క్రెడిట్ స్కోర్" అనేది Google Payలో TUCIBIL అందించిన మీ క్రెడిట్ సమాచార నివేదికలో ఉన్న స్కోర్.

"క్రెడిట్ స్కోర్ సిమ్యులేటర్" అనేది TUCIBI ద్వారా Google Payలో అందించబడే ఒక టూల్, ఇది ఆర్థిక సర్వీసుల ప్రోడక్ట్‌లతో మీ ఇంటరాక్షన్, ఉదాహరణకు, క్రెడిట్ పేమెంట్ చేయకపోవడం మీ ప్రస్తుత CIBIL స్కోర్‌పై ఎలా ప్రభావం చూపుతుందనే దానిపై మీకు అవగాహన కల్పిస్తుంది.

"కస్టమర్ తాలూకు బ్యాంక్" UPI ద్వారా పేమెంట్ లావాదేవీలను డెబిట్ చేయడం/క్రెడిటింగ్ చేయడం కోసం యూజర్ అతని/ఆమె ఫండింగ్ ఖాతాను నిర్వహించే బ్యాంక్, ఆ ఫండింగ్ ఖాతాను లింక్ చేసిన బ్యాంక్ అని అర్థం.

"ఎండ్ యూజర్ అనుమతించిన ప్రయోజనం" అంటే దిగువ నియమాలకు లోబడి మీరు Google Payలో రిక్వెస్ట్ చేసినప్పుడు మీ క్రెడిట్ సమాచారానికి యాక్సెస్‌ను అందించే ఏకైక ప్రయోజనం కోసం క్రెడిట్ సమాచారాన్ని ఉపయోగించడం.

"ఫండింగ్ ఖాతా" అంటే క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఖాతా (డెబిట్ కార్డ్ లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారా), BHIM UPI ఖాతా లేదా పేమెంట్ లావాదేవీలకు నిధులను సమకూర్చడం కోసం యూజర్ ద్వారా రిజిస్టర్ చేయబడిన లేదా ఉపయోగించబడిన ప్రీపెయిడ్ పేమెంట్ ఆప్షన్ (క్యాష్ కార్డ్ లేదా ఈ-వాలెట్ వంటివి).

"GAP" అంటే MMTC అందించిన గోల్డ్ అక్యుములేషన్ ప్లాన్.

"గోల్డ్ ఖాతా" అంటే Google Payలో GAPకి లింక్ చేయబడిన ఖాతా అని అర్థం.

"గోల్డ్" అంటే మీ GAP ఖాతాలోని గోల్డ్.

"Google ఖాతా" అంటే సార్వత్రిక నిబంధనలలో నిర్వచించిన విధంగా Google Pay సర్వీసులు, ఇతర Google సర్వీసుల వినియోగం కోసం మీరు Google లేదా గ్రూప్ కంపెనీలతో క్రియేట్ చేసే ఖాతా.

"Google గ్రూప్ కంపెనీలు" లేదా "గ్రూప్ కంపెనీలు" అంటే Googleకు చెందిన పేరెంట్, దాని సబ్సిడరీలు, అనుబంధ కంపెనీలు, పేరెంట్ అంతిమ హోల్డింగ్ కంపెనీ, వాటి అనుబంధ కంపెనీలతో సహా దాని ప్రత్యక్ష లేదా పరోక్ష సబ్సిడరీలు.

"Google Pay సర్వీసు(లు)" లేదా "సర్వీసు(లు)" అంటే Google Pay యాప్ లేదా ఇతర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా Google అందించే పేమెంట్ లావాదేవీ సులభతర సర్వీసులు, మొబైల్ రీఛార్జ్‌లు, బిల్లు పేమెంట్ సర్వీసులు, ఇతర సర్వీసులు.

"లోన్ సదుపాయం" అంటే, లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీతో మీ ఒప్పందం ప్రకారం మీకు లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీ అందించే లోన్‌లు, అడ్వాన్స్‌లు.

"లోన్ సదుపాయం సర్వీసులు" అంటే లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీల నుండి మీకు లోన్ సదుపాయాన్ని సులభతరం చేయడానికి ఉన్న Google Pay సర్వీసులు.

"వ్యాపారి" అంటే (i) ఎవరైతే Google Pay for Business ప్రోగ్రామ్‌ను పొందుతారో; లేదా (ii) ఎవరైతే పేమెంట్ పార్టిసిపెంట్ ద్వారా Google Payని దాని కస్టమర్‌లకు పేమెంట్ ఆప్షన్‌గా అందిస్తారో; లేదా (iii) ఎవరైతే ఆఫ్‌లైన్ లేదా ఏదైనా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా వ్యాపారి నుండి కొనుగోలు చేసిన వస్తువులు, సర్వీసుల కోసం దాని కస్టమర్‌ల నుండి పేమెంట్‌లను కలెక్ట్ చేయడానికి Google Payని ఉపయోగిస్తారో సదరు వ్యక్తి లేదా సంస్థ అని అర్థం.

"MMTC" అంటే MMTC-PAMP, Google Pay ద్వారా GAPని అందించే కంపెనీ.

"NPCI" అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించిన ప్రామాణిక (ఆథరైజ్డ్) పేమెంట్స్ సిస్టమ్ ఆపరేటర్. UPIకి NPCI ఓనర్‌. అలాగే దాన్ని ఆపరేట్ కూడా చేస్తోంది.

"P2P సర్వీస్" అంటే P2P పేమెంట్ లావాదేవీలను సులభతరం చేయడానికి Google Pay సర్వీసులు.

"P2P పేమెంట్" లేదా "పీర్-టు-పీర్ పేమెంట్" అంటే P2P సర్వీసును ఉపయోగించి యూజర్ ప్రారంభించిన పేమెంట్ అంటే యూజర్ (అంటే పంపినవారి) ఫండింగ్ ఖాతా నుండి డెబిట్ (లేదా ఛార్జీలు విధిస్తుంది) చేస్తుంది, ఇది గ్రహీత సూచించిన పేమెంట్ ఆప్షన్‌లో నిధులను అందుబాటులో ఉంచుతుంది.

"పేమెంట్ ఆప్షన్" అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, బ్యాంక్ ఖాతా, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (ఆప్షన్) లాంటివి ఉంటాయి. ఇందులోకి సంబంధిత చట్టాన్ని అనుసరించి జారీ అయిన ఈ-వాలెట్‌లు, గిఫ్ట్ కార్డ్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా ఒక యూజర్, పేమెంట్ లావాదేవీలను చేయడానికి, లేదా ఒక గ్రహీత (రిసిపియెంట్), పేమెంట్లను స్వీకరించడానికి అర్హత లభిస్తుంది.

"పేమెంట్స్ సిస్టమ్" వర్తించే చట్టంలోని నిబంధనల ప్రకారం దానికి ఆపాదించబడిన అర్థాన్ని కలిగి ఉంటుంది.

"పేమెంట్ పార్టిసిపెంట్‌లు" అంటే పేమెంట్/బిల్ అగ్రిగేటర్‌లు, పేమెంట్‌ల సిస్టమ్ ప్రొవైడర్‌లు, కొనుగోలు చేసే బ్యాంకులు, పార్ట్‌నర్ బ్యాంకులు, పేమెంట్‌ను పంపిన వారి ఫండింగ్ ఖాతాను జారీ చేసే సంస్థ, గ్రహీత బ్యాంక్ ఖాతాను జారీ చేసే బ్యాంకుతో సహా పేమెంట్ సిస్టమ్‌లో పాల్గొన్న అన్ని పార్టీలు. ఖాతా, పేమెంట్ ఆప్షన్‌లను జారీ చేసే సంస్థ, అనుబంధిత కార్డ్‌లు, NPCI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన వాటితో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా అన్నీ.

పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్” లేదా “PSP” UPI ఫ్రేమ్‌వర్క్ కింద "పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్" వలె వ్యవహరించడానికి అధికారం కలిగిన పేమెంట్ పార్టిసిపెంట్ అయిన బ్యాంకింగ్ సంస్థ, ఇది యూజర్‌లకు UPI సర్వీసులను అందించడానికి TPAPని నియమిస్తుంది.

"పేమెంట్‌ల సిస్టమ్ ప్రొవైడర్‌లు" అంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కార్డ్ అసోసియేషన్‌లు, ఇతర పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్‌లు (పేమెంట్, సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007 ప్రకారం నిర్వచించబడినవి), వీరితో పేమెంట్ లావాదేవీలను సులభతరం చేయడానికి (కింద నిర్వచించినట్లు) Google పేమెంట్స్ సిస్టమ్ ప్రొవైడర్ సర్వీసులను ఉపయోగించి ఒప్పందం కుదుర్చుకుంది.

"పేమెంట్‌ల సిస్టమ్ ప్రొవైడర్ సర్వీసులు" అంటే (i) కార్డ్ లావాదేవీలు, (ii) BHIM UPI ఆధారిత లావాదేవీలు; (iii) నెట్ బ్యాంకింగ్, (iv) ప్రీపెయిడ్ పేమెంట్ ఆప్షన్ కోసం పేమెంట్‌ల్లో పార్టిసిపెంట్‌ల పేమెంట్ సూచనలను అందించడానికి పేమెంట్ గేట్‌వే సిస్టమ్/ఇంటర్‌ఫేస్/సర్వీసులు అందించబడతాయి ; జారీ చేసే సంస్థలు, కార్డ్ అసోసియేషన్‌లు, NPCI మరియు/లేదా ఇతర థర్డ్-పార్టీ క్లియరింగ్‌హౌస్‌ల నుండి ప్రామాణీకరణను, అధికారాన్ని అందించండి; మరియు/లేదా (v) యూజర్ ప్రారంభించిన పేమెంట్ సూచనలకు సంబంధించి సెటిల్మెంట్ సౌకర్యాలను అందిస్తుంది.

"గ్రహీత" పంపిన వారి నుండి పేమెంట్‌ను స్వీకరించే యూజర్, వ్యాపారి, బిల్లర్ లేదా థర్డ్-పార్టీ అని అర్థం.

"పంపే వారు" అంటే గ్రహీతకు పేమెంట్‌ను పంపడానికి Google Pay సర్వీసులను ఉపయోగించే యూజర్ అని అర్థం.

TPAPs” UPI ఆధారిత పేమెంట్ లావాదేవీలను సులభతరం చేయడానికి యూజర్‌లకు UPI అనుగుణ అప్లికేషన్ అయిన Google Payని అందించే థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP) అని అర్థం.

"లావాదేవీ" లేదా "పేమెంట్ లావాదేవీ" పేమెంట్‌లను పంపడం లేదా స్వీకరించడం కోసం యూజర్ చేసిన పేమెంట్ రిక్వెస్ట్; (ii) అతని/ఆమె ఫండింగ్ ఖాతా డెబిట్ కోసం పంపిన వారు అందించిన పేమెంట్ సూచనలు.

"UPI" అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్.

"UPI లావాదేవీ డేటా" అంటే వ్యక్తిగత UPI లావాదేవీ డేటా అంటే స్పష్టమైన టెక్స్ట్ ఫార్మాట్‌లోని డేటా.

"యూజర్" అంటే Google Pay సర్వీస్(ల) కోసం రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి పేమెంట్‌లను పంపడానికి లేదా స్వీకరించడానికి UPI పేమెంట్ సదుపాయంతో సహా, సదరు వ్యక్తి యుక్తవయస్సులో ఉన్నట్లయితే, సదరు యువకుడికి తల్లి/తండ్రి లేదా లీగల్ గార్డియన్ కూడా ఉంటారు.

"మేము", "మేము" లేదా "మా" అంటే Google అని అర్థం.

"మీరు", "మీరు", లేదా "మీ" అంటే యూజర్ అని అర్థం.

3. Google Pay సర్వీసుల స్కోప్

Google Pay ("Google Pay" లేదా "Google Pay యాప్") అనేది Google Pay సర్వీసును సులభతరం చేసే పేమెంట్ పరిష్కార అప్లికేషన్. Google Pay ద్వారా, మీరు Google Pay ద్వారా ఆమోదించబడిన ఏదైనా పేమెంట్ ఆప్షన్‌లను ఉపయోగించి సర్వీస్ ప్రొవైడర్‌లకు, యూజర్‌లకు, వ్యాపారులకు, బిల్లర్‌లకు లేదా థర్డ్-పార్టీలకు పేమెంట్‌లను పంపవచ్చు. మీరు నిధులను స్వీకరించడానికి Google Payలో నిర్దేశించిన పేమెంట్ ఆప్షన్‌లో ఇతర యూజర్‌లు లేదా థర్డ్-పార్టీల నుండి కూడా మీరు పేమెంట్‌లను స్వీకరించవచ్చు. అదనంగా, ఇతర యూజర్‌లు, సర్వీస్ ప్రొవైడర్‌లు, బ్యాంకులు, వ్యాపారులు, బిల్లర్‌ల నుండి కమ్యూనికేషన్‌లు, ఆఫర్‌లు, సర్వీసులతో కమ్యూనికేట్ చేయడానికి లేదా స్వీకరించడానికి Google Pay మిమ్మల్ని అనుమతిస్తుంది. UPI పేమెంట్ లావాదేవీలకు సంబంధించి, Google Pay అనేది HDFC బ్యాంక్, Axis బ్యాంక్, ICICI బ్యాంక్, State Bank of India ద్వారా పేమెంట్ లావాదేవీలను సులభతరం చేయడానికి NPCI ద్వారా అధికారం పొందిన TPAP. మేము సర్వీస్ ప్రొవైడర్‌గా పని చేస్తాము, PSP బ్యాంకుల ద్వారా UPIలో పార్టిసిపేట్ చేస్తాము. మేము NPCI, మా ప్రతి స్పాన్సర్ PSPలయిన - HDFC బ్యాంక్, Axis బ్యాంక్, ICICI బ్యాంక్, State Bank of Indiaలతో కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందాలకు కట్టుబడి ఉంటాము. UPI పేమెంట్ లావాదేవీలో Google Pay, PSP, NPCI తాలూకు ఖచ్చితమైన పాత్రలు, బాధ్యతల కోసం, దయచేసి ఇక్కడ రెఫర్ చేయండి. స్పష్టంగా తెలియజేయునది ఏమనగా, UPI లావాదేవీలకు సంబంధించి, మీరు ఆ PSP నియమాలకు, షరతులకు లోబడి ఉంటారు. ఇంకా, UPI లావాదేవీల సమయంలో లేదా దాని ప్రకారం PSP బ్యాంక్‌కు అందుబాటులో ఉన్న మీ వ్యక్తిగత డేటాను PSP బ్యాంక్ ఉపయోగించడం, ప్రాసెస్ చేయడం PSP బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న గోప్యతా పాలసీకి లోబడి ఉంటుంది.

Google Pay మీకు Google Payలో థర్డ్-పార్టీ ప్రోడక్ట్‌లను లేదా సర్వీసులను అందించడానికి వీలు కల్పిస్తుంది. ఈ థర్డ్-పార్టీ ప్రోడక్ట్‌లు లేదా సర్వీసులు Google కాకుండా ఇతర పార్టీల ద్వారా అందించబడతాయి, థర్డ్-పార్టీ నియమాలకు లోబడి ఉంటాయి. ఈ థర్డ్-పార్టీ సర్వీసులను ఉపయోగించడానికి మీరు అదనపు నియమాలను, షరతులను అంగీకరించి, అదనపు ఆవశ్యకతలను పూర్తి చేయవలసి ఉంటుంది. మీరు విశ్వసించే థర్డ్-పార్టీ ప్రోడక్ట్‌తో లేదా సర్వీసుతో మాత్రమే మీరు లావాదేవీలు జరపాలి. Google Payలో థర్డ్-పార్టీ ప్రోడక్ట్‌తో లేదా సర్వీసుతో మీ ఇంటరాక్షన్ ఫలితంగా మీకు కలిగే ఏదైనా నష్టానికి సంబంధించి Google బాధ్యులు కాదు లేదా మీకు బాధ్యత వహించదు.

పేమెంట్ లావాదేవీ మెకానిక్స్. Google Pay ద్వారా నిర్వహించబడే పేమెంట్ లావాదేవీలు లేదా ఏదైనా కమ్యూనికేషన్/ఆఫర్‌లు అనేవి పేమెంట్ అమౌంట్‌ను పంపినవారికి, అందుకునే వారికి మధ్య మాత్రమే జరుగుతాయి. పేమెంట్‌ల సిస్టమ్ ప్రొవైడర్ సర్వీసులను ఉపయోగించి పేమెంట్‌లను పంపడం మరియు/లేదా స్వీకరించడం సులభతరం చేయడానికి Google Pay పేమెంట్‌లను పంపినవారు, అందుకునేవారు, సంబంధిత పేమెంట్‌ల సిస్టమ్ ప్రొవైడర్‌ల మధ్య లింక్‌ను క్రియేట్ చేస్తుంది. పేమెంట్‌ల సిస్టమ్ ప్రొవైడర్ సర్వీసుల ద్వారా పేమెంట్ లావాదేవీ ప్రామాణీకరించబడి, అధికారికం అయ్యి, ప్రాసెస్ చేయబడిన తర్వాత:

(i) సంబంధిత పేమెంట్‌లలో పార్టిసిపెంట్‌ల ద్వారా పేమెంట్ నేరుగా గ్రహీతతో సెటిల్ చేయబడుతుంది; లేదా

(ii) కొన్ని సందర్భాల్లో, మధ్యవర్తిగా వ్యవహరించి, గ్రహీత తరపున పేమెంట్ లావాదేవీకి సంబంధించిన నిధులను మేము అందుకోవచ్చు. సదరు సందర్భాలలో, యూజర్‌ల నుండి నిధులను స్వీకరించే పరిమిత ప్రయోజనం కోసం Google గ్రహీత తరపున కేవలం పేమెంట్ కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

పేమెంట్ లావాదేవీలలో Google బాధ్యత. మీరు కింది వాటిని అర్థం చేసుకుని, అంగీకరించాలి:

  • Google, పేమెంట్ లావాదేవీల సహాయకులు మాత్రమే.
  • ఈ పేమెంట్ లావాదేవీలలో Google పార్టీ కాదు.
  • Google పేమెంట్‌ల సిస్టమ్ ప్రొవైడర్ కాదు.
  • Google కొన్ని సందర్భాల్లో, గ్రహీత తరపున నిధులను స్వీకరించే పరిమిత ప్రయోజనం కోసం మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది, పేమెంట్ కలెక్షన్ ఏజెంట్‌గా పని చేస్తుంది.
  • మీరు కొనుగోలు చేసే ప్రోడక్ట్‌లు లేదా సర్వీసులకు సంబంధించిన ఏదైనా అంశానికి Google బాధ్యత వహించదు, వహించబోదు.
  • మీరు చేసే ఏవైనా కమ్యూనికేషన్‌లకు గానీ, Google Pay ద్వారా మీకు అందించే ఏదైనా కమ్యూనికేషన్‌కు లేదా ఆఫర్‌లకు గానీ Google బాధ్యత వహించదు, వహించబోదు.
  • పేమెంట్ లావాదేవీల ప్రకారం తలెత్తే ఏవైనా వివాదాలు, ఛార్జ్‌బ్యాక్‌లు లేదా రివర్సల్స్‌కు Google పార్టీగా ఉండదు, బాధ్యత వహించదు.
  • ఏదైనా లావాదేవీని పూర్తి చేయకపోవడంతోపాటు, యూజర్‌లు చేసే ఏ చర్యకైనా Google బాధ్యత వహించదు.
  • లావాదేవీకి సదుపాయాన్ని అందజేయడం అనేది పేమెంట్‌లను పంపినవారు అతను లేదా ఆమె ఉపయోగించిన ఫండింగ్ ఖాతాలో తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని గానీ, లావాదేవీ ప్రామాణీకరించబడుతుందని లేదా ప్రాసెస్ చేయబడుతుందని గానీ లేదా లావాదేవీ తర్వాత ఛార్జ్‌బ్యాక్‌కు లేదా ఇతర రివర్సల్‌కు దారితీయదని గానీ హామీ ఇవ్వదు.
  • ఏదైనా పేమెంట్ లావాదేవీకి సంబంధించి Google ట్రస్టీగా గానీ లేదా విశ్వసనీయ బంధపు హోదాతో గానీ వ్యవహరించడం లేదు.
  • అమ్మకానికి అందించే ప్రోడక్ట్‌లు, సర్వీసుల ధరతో సహా పేమెంట్ లావాదేవీ తాలూకు వాణిజ్య నియమాలను Google నిర్ణయించదు, ఆ విషయంలో సలహా ఇవ్వదు లేదా ఏ విధంగానూ నియంత్రించదు.

Google బాధ్యతకు సంబంధించి నిరాకరణ. మీరు కొనుగోలు చేసే ప్రోడక్ట్‌లకు లేదా సర్వీసులకు సంబంధించిన అంశం దేనికైనా గానీ లేదా మీకు అందించే ఏవైనా కమ్యూనికేషన్‌లకు లేదా ఆఫర్‌లకు గానీ Google బాధ్యత వహించదు. గ్రహీత కోసం పేమెంట్ కలెక్షన్ ఏజెంట్‌గా Google పాత్ర ప్రకారం వ్యాపారి విక్రయించే ప్రోడక్ట్‌లు మరియు/లేదా సర్వీసులకు సంబంధించి ప్రాతినిధ్యాల, హామీల ఉల్లంఘన, అమ్మకం తర్వాత సర్వీసులు లేదా వారంటీ సర్వీసులు అందించకపోవడం లేదా మోసం వంటి వాటికి Google బాధ్యత వహించదు.

బిల్ పేమెంట్ సర్వీసులు. Google Pay మీ బిల్లులు లేదా అర్హతగల ప్రీ-పెయిడ్ ప్లాన్‌లను చూడడానికి, Google Pay యాప్ ద్వారా బిల్లర్‌లకు పేమెంట్‌లు చేయడానికి మిమ్మల్ని అనుమతించే బిల్లు పేమెంట్ సర్వీసులను సులభతరం చేస్తుంది. Google Pay ద్వారా అందించబడిన బిల్ పేమెంట్ సర్వీసులు (i) భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ ("BBPS") కింద భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ ("BBPOU") ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా అందించబడతాయి, ఇక్కడ BBPS లోపల పార్టిసిపేట్ చేయడానికి బిల్లర్ NPCIతో రిజిస్టర్ చేయబడతారు; లేదా (ii) Google ఒక ఒప్పంద అమరికలోకి ప్రవేశించిన బిల్లర్ అగ్రిగేటర్ ద్వారా అందించబడతాయని మీరు అర్థం చేసుకున్నారు. బిల్ వినియోగాన్ని, బిల్లు పేమెంట్‌ను మాత్రమే Google Pay సులభతరం చేస్తుందని, ఇంకా అది (i) BBPS కోసం NPCIలో బిల్లర్ రిజిస్టర్ చేయబడిన వర్తించే చట్టానికి అనుగుణంగా BBPOU ఏజెంట్; లేదా (ii) బిల్లు పేమెంట్‌లో సాంకేతిక సహాయాన్ని అందిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు.

క్రెడిట్ కార్డ్ సర్వీసులు. Google Pay మీకు క్రెడిట్ సంస్థల నుండి క్రెడిట్ కార్డ్ ఆఫర్‌లను డిస్‌ప్లే చేయడానికి టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. అటువంటి క్రెడిట్ కార్డ్ నియమాలు, మీకు, క్రెడిట్ సంస్థకు మధ్య సదరు క్రెడిట్ కార్డ్ కోసం ఎగ్జిక్యూట్ అయ్యే ఒప్పందాల నియమాలకు కట్టుబడి ఉంటాయని మీరు అర్థం చేసుకున్నారు, అంగీకరిస్తున్నారు. Google సదరు ఒప్పందాలలో పార్టీ కాదు, ఎటువంటి బాధ్యతను కలిగి ఉండదు, కార్డ్ దరఖాస్తు తాలూకు ఆమోదం లేదా తిరస్కరణకు ఎటువంటి వాగ్దానాలు, వారంటీలు లేదా హామీలు ఇవ్వదు, ఇది క్రెడిట్ కార్డ్‌ను జారీ చేసే క్రెడిట్ సంస్థ తన స్వంత విచక్షణ మేరకు చేస్తుంది. సదరు క్రెడిట్ కార్డ్‌ల విషయంలో Google బాధ్యత క్రెడిట్ సంస్థలు అందించే క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన సాంకేతిక సర్వీసులను అందించడానికి, Google Pay యూజర్‌లకు ప్రత్యేకంగా అందుబాటులో ఉండే క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన సర్వీసులను, ఆఫర్‌లను అందించడానికి క్రెడిట్ సంస్థలతో సహకరించడానికి పరిమితం చేయబడుతుంది (ఉదా., Axis బ్యాంక్ ACE కార్డ్, ఇది Axis బ్యాంక్ ద్వారా జారీ చేయబడింది, Google సహకారంతో మార్కెట్ చేయబడింది).

లోన్ సదుపాయం సర్వీసులు. లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీలు మీకు లభ్యమయ్యే లోన్ సదుపాయపు ఆఫర్‌ల డిస్‌ప్లే కోసం Google Pay టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. సదరు లోన్ సదుపాయపు నియమాలు మీకు, లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీకి మధ్య ఎగ్జిక్యూట్ అయ్యే లోన్ ఒప్పందాలకు కట్టుబడి ఉంటాయని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. సదరు లోన్ ఒప్పందాలలో Google పార్టీ కాదు, సదరు లావాదేవీలలో Google బాధ్యత మధ్యవర్తి టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌కు మాత్రమే పరిమితం చేయబడుతుంది.

Google Pay గోల్డ్ సర్వీసులు. యూజర్‌లకు MMTC ద్వారా బంగారాన్ని విక్రయించడం, డెలివరీ చేయడం, తిరిగి కొనుగోలు చేయడం, ఇతర సంబంధిత సర్వీసులను అందించడం కోసం Google Pay MMTC - PAMP ("MMTC")కి టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. మీరు MMTC నియమాలు వద్ద అందుబాటులో ఉన్న నియమాలు, షరతులు మీ GAPని కంట్రోల్ చేస్తాయని అంగీకరించి, ధృవీకరిస్తున్నారు. మీ GAPకి సంబంధించి Google మీకు ఎలాంటి బాధ్యత వహించదు.

బిజినెస్ పేజీలు. Google Pay మీ బిజినెస్ పేజీని Google Payలో పబ్లిష్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. బిజినెస్ పేజీలో మీ బిజినెస్ గురించి సమాచారాన్ని అందించడానికి, మీ ప్రోడక్ట్‌లు, సర్వీసులలో కొన్నింటిని లిస్ట్ చేయడానికి అందుబాటులో ఉన్న ఐటెమ్‌లు లేదా సర్వీసుల క్యాటలాగ్ ఉంటుంది. మీరు మీ నెట్‌వర్క్‌లోని ఎవరితోనైనా ఈ పేజీకి URLను షేర్ చేయవచ్చు. మీ బిజినెస్ పేజీని షేర్ చేయడం ద్వారా, మీ ప్రొఫైల్ ఫోటో, పేరు షేర్ చేయబడతాయని, పబ్లిక్‌గా అందుబాటులో ఉంటాయని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. బిజినెస్ పేజీలను ఉపయోగించి, మీరు మరో రకంగా Google ద్వారా అనుమతించబడినప్పుడు మినహాయించి, వర్తించే చట్టానికి లోబడి, P2P పేమెంట్‌లను ఉపయోగించి నెలకు INR 50,000 వరకు వస్తువులను, సర్వీసులను విక్రయించగలరు. మీ వస్తువులు లేదా సర్వీసుల కొనుగోలుదారుతో మీ లావాదేవీలకు Google పార్టీగా ఉండదు, విక్రయించిన వస్తువులకు గానీ, సర్వీసులకు గానీ ఎలాంటి బాధ్యత వహించదు. క్యాటలాగ్, ఇన్వెంటరీ, ప్రైసింగ్, లాజిస్టిక్స్, వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్, డెలివరీ లేదా ఫుల్‌ఫిల్‌మెంట్‌పై Google ఎలాంటి నియంత్రణను గానీ లేదా పర్యవేక్షణను గానీ అమలు చేయదు. మీ బిజినెస్ పేజీకి, దాని కంటెంట్‌కు, లావాదేవీల నిర్వహణకు మీరే పూర్తిగా బాధ్యులు అవుతారు. మీ బిజినెస్ పేజీని సెటప్ చేయడంలో మీకు సహాయం చేయడంలో మీకు సాంకేతిక సర్వీస్ ప్రొవైడర్‌గా మాత్రమే Google బాధ్యత తీసుకుంటుంది. బిజినెస్ పేజీల కింద ప్రోడక్ట్‌కు లేదా సర్వీసుకు సంబంధించి ఏదైనా రియల్-టైం కమ్యూనికేషన్ మీకు, కొనుగోలుదారుకు మధ్య ఉంటుంది, దానిలో Google జోక్యం ఏమీ ఉండదు. Google బిజినెస్ పేజీలకు ఎటువంటి కస్టమర్ సపోర్ట్‌ను అందించదు లేదా లావాదేవీ స్టేటస్‌ను ట్రాక్ చేయడంలో సహాయం చేయదు. బిజినెస్ పేజీలలో యూజర్ పొందిన ప్రోడక్ట్‌లు, సర్వీసులు లేదా సమాచారం క్వాలిటీపై గానీ లేదా సదరు ప్రోడక్ట్‌లు లేదా సర్వీసులు యూజర్ అంచనాలను అందుకోవడంపై గానీ Google ఎటువంటి వారంటీని ఇవ్వదు, దానిని అనివార్యకార్యంగా భావించదు. మీ కస్టమర్‌లు కలిగి ఉన్న ఏవైనా ఫిర్యాదులకు లేదా వివాదాలకు మీరు బాధ్యత వహించాలి, బిజినెస్ పేజీలలో ఏవైనా కస్టమర్ ఫిర్యాదులకు Google బాధ్యత వహించదు. ఒకవేళ మీరు ఈ ఫీచర్ కోసం సర్వీస్ నియమాలను పాటించడం ఇష్టం లేకుంటే లేదా ఏ సమయంలోనైనా యాప్‌లో అందించిన మేనేజ్‌మెంట్ ఆప్షన్‌లను ఉపయోగించి మీ బిజినెస్ పేజీని తప్పనిసరిగా తొలగించాలి.

4. మీ Google Pay వినియోగం

వయోపరిమితులు. Google Payని ఉపయోగించడానికి మీ వయస్సు తప్పనిసరిగా 13 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. Google Payలో మీ Google ఖాతాను ఉపయోగించడానికి మీరు ఎవరినైనా అనుమతిస్తే, అటువంటి వ్యక్తులు సంయుక్త Google Pay నియమాలను పాటిస్తున్నారని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. ఈ వ్యక్తులు Google Payలో మీ Google ఖాతా ద్వారా మరియు/లేదా తీసుకునే అన్ని చర్యలకు మీరే బాధ్యత వహించాలి.

ప్రాదేశిక పరిమితులు. Google Payని ఉపయోగించడానికి, Google Payలో మీ Google ఖాతాను రిజిస్టర్ చేసేటప్పుడు లేదా లింక్ చేసేటప్పుడు మీరు భౌతికంగా భారతదేశంలో ఉండాలి, మీ వద్ద భారతీయ బ్యాంక్ ఖాతా, భారతీయ మొబైల్ నంబర్ ఉండాలి. Google Pay యాప్‌ను భారతదేశం వెలుపల ఉపయోగించకూడదు.

ప్రాథమిక వినియోగ ఆవశ్యకతలు. మీకు మొబైల్, ఇంటర్నెట్ లేదా మరేదైనా సపోర్ట్ ఉన్న పరికరం ("పరికరం") ఆవశ్యకత, ఇది నిర్దిష్ట సిస్టమ్, అనుకూలత ఆవశ్యకతలకు అనుగుణంగా ఉంటుంది, Google Payని ఉపయోగించడానికి ఇది ఎప్పటికప్పుడు మారవచ్చు. Google Payని ఉపయోగించగల మీ సామర్థ్యం, Google Pay యాప్ పనితీరును ఈ ఫ్యాక్టర్లు ప్రభావితం చేయవచ్చు. మీ మొబైల్ పరికరం, టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్‌తో మీ ఒప్పందం ప్రకారం అందించబడిన ఏవైనా వర్తించే మార్పులు, అప్‌డేట్‌లు, ఫీజులు, అన్ని ఇతర నియమాలతో సహా సదరు ఆవశ్యకతలకు మీరే బాధ్యత వహిస్తారని మీరు అంగీకరిస్తున్నారు. మీ ఇంటర్నెట్ లేదా పరికర సర్వీస్ ప్రొవైడర్ కారణంగా ఏదైనా సెక్యూరిటీ ల్యాప్స్‌కు లేదా విఫలమైన లావాదేవీలకు Google బాధ్యత వహించదు.

అప్‌డేట్‌లు. మీరు Google Pay సర్వీసులను యాక్సెస్ చేయడానికి, ఉపయోగించడానికి లేదా ఉపయోగించడం కొనసాగించడానికి మీ Google Pay యాప్ లేదా Google ఎప్పటికప్పుడు పరిచయం చేసే సంబంధిత Google సాఫ్ట్‌వేర్‌కు అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేయాల్సి రావచ్చు. బగ్ పరిష్కారాలు, ప్యాచ్‌లు, మెరుగుపరచబడిన ఫంక్షన్‌లు, మిస్ అయిన ప్లగిన్‌లు, కొత్త వెర్షన్‌లు (సమిష్టిగా, "అప్‌డేట్‌ల") వంటి Google Payకి అందుబాటులో ఉన్న అప్‌డేట్‌ల కోసం మీ Google Pay యాప్ ఎప్పటికప్పుడు Google సర్వర్‌లతో కమ్యూనికేట్ చేయవచ్చు. మీరు Google Payని ఉపయోగించాలంటే, మీరు ఆటోమేటిక్‌గా రిక్వెస్ట్ చేయబడిన సదరు అప్‌డేట్‌లను స్వీకరించడానికి అంగీకరించాలి. ఆటోమేటిక్‌గా రిక్వెస్ట్ చేయబడిన, స్వీకరించిన సదరు అప్‌డేట్‌లకు మీరు అంగీకరించకపోతే, దయచేసి Google Pay యాప్‌ను ఉపయోగించవద్దు. పైన పేర్కొన్న వాటితో పాటుగా, Google Pay యాప్‌ను Google Pay యాప్ లేదా మీ పరికరంలో మీరు ఎంచుకున్న ఏవైనా అప్‌డేట్ సెట్టింగ్‌లతో సంబంధం లేకుండా, ఒకవేళ అప్‌డేట్ Google Pay యాప్‌నకు సంబంధించిన క్లిష్టమైన సెక్యూరిటీ లోపాన్ని పరిష్కరిస్తుందని Google నిశ్చయించినట్లయితే, Google Pay యాప్‌ను సదరు యాప్ తాలూకు కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేయవచ్చు.

5. Google Pay సర్వీసులను సెటప్ చేస్తోంది

Google Payని ఉపయోగించడానికి మీరు తప్పనిసరిగా Google ఖాతాను కలిగి ఉండాలి. మీకు ఇప్పటికే Google ఖాతా లేకుంటే, మీరు Google Payలో ఒకదాని కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు Google Payలో మీ Google ఖాతాకు లాగిన్ చేసినప్పుడు, మీరు ఈ సంయుక్త Google Pay నియమాలను ఆమోదించిన తర్వాత మీ Google Pay సర్వీసులు యాక్టివేట్ చేయబడతాయి. మీరు మీ Google ఖాతాను డిజేబుల్ చేస్తే, మీ Google Pay ఖాతాతో సహా అన్ని సంబంధిత ఖాతాలు సస్పెండ్ చేయబడతాయి. మీరు Google ఖాతా రీస్టోరేషన్‌ను కోరవచ్చు, ఇది మీ Google Pay ఖాతాకు మీ యాక్సెస్‌ను కూడా రీస్టోర్ చేస్తుంది. మీరు Google ఖాతాను డిజేబుల్ చేయడం వల్ల, ఖాతాకు సంబంధించిన కొంత‌ నిర్దిష్ట డేటాకు యాక్సెస్‌ను కోల్పోవచ్చు లేదా డేటా పూర్తిగా తొలగించబడవచ్చు, తిరిగి పొందలేకపోవచ్చు. మీరు Google ఖాతాను మూసివేయడం, దాని తదుపరి రీస్టోరేషన్ ఫలితంగా మీ డేటాను కోల్పోవడం లేదా మీకు సంభవించే ఏదైనా ఇతర నష్టానికి Google బాధ్యత వహించదని మీరు అంగీకరిస్తున్నారు, ఆమోదిస్తున్నారు.

లాగిన్/రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సమయంలో లేదా ఆ తర్వాత ఎప్పుడైనా, మీ పేరు, ఫోన్ నంబర్, పేమెంట్ పరికరం సమాచారం (వర్తిస్తే, మీ బ్యాంక్ పేరు, బ్యాంక్ ఖాతా నంబర్, క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ వివరాలతో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా) పుట్టిన తేదీ మరియు/లేదా ఇతర రిజిస్ట్రేషన్ సమాచారం అందించమని మిమ్మల్ని అడగవచ్చు. దిగువ నిర్వచించిన విధంగా మేము మీ రిజిస్ట్రేషన్ సమాచారాన్ని పేమెంట్ పార్టిసిపెంట్, సర్వీస్ ప్రొవైడర్ మరియు/లేదా థర్డ్-పార్టీ ప్రొవైడర్‌తో వెరిఫై చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో, మేము మీ ఐడెంటిటీని లేదా మీరు అందించిన సమాచారపు ఖచ్చితత్వాన్ని వెరిఫై చేయడంలో మాకు సహాయపడటానికి అదనపు సమాచారం/డాక్యుమెంటేషన్‌ను పంపమని లేదా అదనపు ప్రశ్నలకు (Google Payలో మీ Google ఖాతా యాక్టివేట్ చేయబడటానికి ముందు లేదా తర్వాత) సమాధానమివ్వమని మిమ్మల్ని అడగవచ్చు. దిగువున ఉన్న సెక్షన్ 21లో మరింత వివరంగా అందించినట్లుగా, సదరు డేటా తాలూకు కేటాయింపు, వినియోగం Google గోప్యతా పాలసీకి లోబడి ఉంటుంది. మీరు అందించిన సమాచారం, డాక్యుమెంటేషన్ తాలూకు ఖచ్చితత్వం లేదా సంపూర్ణతను మేము వెరిఫై చేయలేకపోయినా లేదా సంయుక్త Google Pay నియమాలకు లేదా పేమెంట్ పార్టిసిపెంట్ నియమాలకు అనుగుణంగా Google Payని ఉపయోగించడానికి మీకు అర్హత లేదని మేము నిర్ధారించినా, మీ Google Pay సర్వీసుల వినియోగాన్ని మేము తిరస్కరించవచ్చు.

BHIM UPI సర్వీసులను సెటప్ చేస్తోంది. మీరు పేమెంట్‌లను పంపడానికి లేదా స్వీకరించడానికి BHIM UPIని ఉపయోగించాలనుకుంటే, మీరు Googleతో పార్ట్‌నర్ అయిన BHIM UPI పేమెంట్‌ల సిస్టమ్ ప్రొవైడర్‌తో రిజిస్టర్ చేసుకోవడానికి Google Payని ఉపయోగించి, మీ BHIM UPI ID (వర్చువల్ పేమెంట్ అడ్రస్) మరియు /లేదా BHIM UPI PIN (MPIN) లింక్ చేయబడింది వంటి మీ BHIM UPI యూజర్ ఆధారాలను క్రియేట్ చేయవచ్చు. మీరు BHIM UPI సర్వీసుల కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత, మీరు మీ బ్యాంక్ ఖాతా నుండి పేమెంట్‌లను పంపవచ్చు లేదా Google Pay ద్వారా BHIM UPIని ఉపయోగించి మీ బ్యాంక్ ఖాతాలోకి పేమెంట్‌లను స్వీకరించవచ్చు.

UPI నంబర్, కేంద్రీకృత UPI మ్యాపర్‌తో ప్రారంభ దశ పూర్తి చేయడం. మీ UPI నంబర్‌ను ఉపయోగించి UPIకి సంబంధించి Google Pay సర్వీసులను ఉపయోగించడానికి మిమ్మల్ని ఎనేబుల్ చేయడానికి Google Payలో మీ Google ఖాతాకు Google UPI నంబర్‌ను కేటాయిస్తుందని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. మీరు NPCI (అంటే, సంఖ్యాత్మక UPI ID మ్యాపర్) NPCI ద్వారా నిర్వహించబడే కేంద్రీకృత మ్యాపర్‌తో, అలాగే NPCIకి అవసరమైన ఏవైనా ఇతర డేటాబేస్‌లతో మీ ప్రారంభ దశ పూర్తి చేయడానికి, ఎప్పటికప్పుడు వాటికి సమాచారం అందించడానికి అంగీకరిస్తున్నారు, ప్రత్యేకంగా Googleకు సమ్మతి అందిస్తున్నారు. 'UPI నంబర్' ఆటోమేటిక్‌గా మీ [రిజిస్టర్డ్ మొబైల్ నంబర్] అవుతుంది, NPCI తాలూకు కేంద్రీకృత మ్యాపర్(ల)కు మీ UPI నంబర్‌ను ప్రారంభ దశను పూర్తి చేయడానికి అనుమతించడం ద్వారా, మీ 'UPI నంబర్'ను ఉపయోగించి Google Pay యాప్‌లో మీరు నిధులను పంపగలరు మరియు / లేదా స్వీకరించగలరు. ప్రారంభ దశ ప్రాసెస్ అనేది NPCI గైడ్‌లైన్స్, ఆదేశాలకు అనుగుణంగా ఉంటుంది. (పరిమితి లేకుండా) మీ UPI వివరాలను NPCIతో షేర్ చేయడం, మీ ప్రధాన బ్యాంక్ ఖాతాను లేదా మీ UPI IDని (వర్చువల్ పేమెంట్ అడ్రస్‌ను) మీ 'UPI నంబర్‌'కు లింక్ చేయడం వంటి పనులతో సహా NPCI సూచనల ప్రకారం పని చేయడానికి Googleకు అర్హత ఉందని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. కేంద్రీకృత మ్యాపర్(ల)లో ప్రారంభ దశ పూర్తి చేసిన తర్వాత, మీరు నిధులను పంపడానికి మరియు / లేదా స్వీకరించడానికి మీ UPI నంబర్‌ను ఉపయోగించగలరు. మీరు ఎప్పుడైనా Google Pay యాప్‌లో [సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయడం] ద్వారా మీ UPI నంబర్ ఆటోమేటిక్ సెట్టింగ్ మ్యాపింగ్‌ను డీలింక్ చేయడానికి ఎంచుకోవచ్చు.

వర్చువల్ ఖాతా నంబర్‌ను సెటప్ చేస్తోంది. మీరు Google Payతో రిజిస్టర్ చేసుకున్న క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పాస్‌లు, Google కాకుండా ఇతర కంపెనీలతో మీరు కలిగి ఉన్న డిజిటల్ వాలెట్‌లను లేదా ఖాతాలను సూచించే బ్యాంక్ జారీ చేసిన వర్చువల్ ఖాతా నంబర్‌ను (ప్రతి ఒక "వర్చువల్ ఖాతా నంబర్") ఉపయోగించి పేమెంట్ లావాదేవీలు చేయడానికి కూడా మీరు Google Payని ఉపయోగించవచ్చు. వర్చువల్ ఖాతా నంబర్‌లను ఈ చోట్లలో ఉపయోగించవచ్చు: (i) పాల్గొనే వ్యాపారి లొకేషన్‌లలో, మీ మొబైల్ పరికరంలో ఉండే మీ Google Pay యాప్ ద్వారా QR కోడ్‌ను ఉపయోగించడం లేదా (ii) నిర్దిష్ట వ్యాపారి యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో లేదా (iii) మీ Google Pay యాప్‌లో బిల్లు పేమెంట్‌లు లేదా ఇతర వ్యాపారి పేమెంట్ లావాదేవీలను ప్రాసెస్ చేయడం కోసం. వెనుక ఉన్న డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ తాలూకు వాస్తవ సంఖ్యను Google Pay స్టోర్ చేయదు, వర్చువల్ ఖాతా నంబర్‌ను మాత్రమే సేవ్ చేస్తుంది.

మీరు Google Payకి వర్చువల్ ఖాతా నంబర్‌ను జోడించడం ప్రారంభించిన తర్వాత, పేమెంట్ ఆప్షన్‌కు అర్హత ఉందో లేదో Google Pay చెక్ చేస్తుంది. మీ పేమెంట్ ఆప్షన్‌ను జారీ చేసిన సంస్థ Google Payకి సపోర్ట్ చేసేది అయ్యి, మీ పేమెంట్ ఆప్షన్‌కు ఒకవేళ అర్హత ఉంటే, దాన్ని జోడించేటప్పుడు మీకు జారీ చేసిన సంస్థ తాలూకు నియమాలను, షరతులను అంగీకరించమని అడుగుతున్న స్క్రీన్‌ను మీరు చూడవచ్చు. మీరు అలా చేసి, పేమెంట్ ఆప్షన్‌ను విజయవంతంగా జోడించిన తర్వాత, మీ పేమెంట్ ఆప్షన్ తాలూకు వాస్తవ కార్డ్ నంబర్‌ను లేదా ఇతర ఐడెంటిఫైయర్‌ను సూచించే వర్చువల్ ఖాతా నంబర్‌ను Google Payతో ఉపయోగించడానికి మీ Google ఖాతాతో Google Pay స్టోర్ చేస్తుంది.

Google గానీ లేదా దాని అనుబంధ సంస్థ గానీ జారీ చేసే సంస్థ అయినప్పుడు మినహా, Google గానీ లేదా దాని అనుబంధ సంస్థలు గానీ మీ పేమెంట్ ఆప్షన్‌ల తాలూకు యూజర్ ఒప్పందానికి, గోప్యతా పాలసీకి లేదా ఇతర వినియోగ నియమాలకు పార్టీగా ఉండవు. ఈ Google Pay ఆఫర్‌ల సంయుక్త నియమాలలో ఏ అంశమూ సదరు జారీ చేసే సంస్థ తాలూకు నియమాలను సవరించదు. ఈ సంయుక్త Google Pay నియమాలకు, మీ జారీ చేసే సంస్థ తాలూకు నియమాలు లేదా గోప్యతా పాలసీకి మధ్య ఏదైనా వైరుధ్యం ఉన్నట్లయితే, Google Payకి సంబంధించి మీకు, Googleకు మధ్య సంబంధాన్ని ఈ సంయుక్త Google Pay నియమాలు అలాగే మీ జారీ చేసే సంస్థకు మీకు మధ్య సంబంధాన్ని సదరు జారీ చేసే సంస్థ తాలూకు నియమాలు నియంత్రిస్తాయి. మీ పేమెంట్ ఆప్షన్‌లు సరిగానే ఉన్నాయని గానీ, మీరు ఒక వ్యాపారి వద్ద లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ దగ్గర Google Payని ఉపయోగించినప్పుడు సదరు లావాదేవీని మీ పేమెంట్ ఆప్షన్‌ను జారీ చేసే సంస్థ, ఆథరైజ్ చేస్తుందని (ప్రామాణీకరిస్తుందని) గానీ, ఆమోదిస్తుందని గానీ Google గ్యారంటీ ఇవ్వదు.

Google గానీ లేదా దాని అనుబంధ సంస్థ గానీ జారీ చేసే సంస్థ అయినప్పుడు మినహా, Googleకు గానీ లేదా దాని అనుబంధ సంస్థలకు గానీ క్రెడిట్‌ను జారీ చేయడంలో లేదా క్రెడిట్‌కు అర్హతను నిర్ణయించడంలో ఎలాంటి ప్రమేయం ఉండదు, ఈ కింది వాటిపై ఏ రకమైన నియంత్రణను కలిగి ఉండవు: పేమెంట్ ఆప్షన్‌లు లేదా నిధుల తాలూకు లభ్యత లేదా ఖచ్చితత్వం; Google Payకి పేమెంట్ ఆప్షన్‌ల కేటాయింపు (లేదా జోడింపు) లేదా పేమెంట్ ఆప్షన్ బ్యాలెన్స్‌లకు నిధుల జోడింపు. నిర్దిష్ట ఉపయోగాల కోసం మీ వర్చువల్ ఖాతా నంబర్‌ను రిజిస్టర్ చేయడానికి లేదా రిజిస్ట్రేషన్ రద్దు చేయడానికి, పేమెంట్ లావాదేవీ పరిమితులను సెట్ చేయడానికి, సవరించడానికి మీకు జారీ చేసిన సంస్థ సర్వీసులను అందిస్తుంది. పైన పేర్కొన్న వాటికి సంబంధించి ఏవైనా సమస్యలుంటే, దయచేసి మీ పేమెంట్ ఆప్షన్‌ను జారీ చేసే సంస్థను సంప్రదించండి.

బిల్ పేమెంట్ సర్వీసులను సెటప్ చేస్తోంది. బిల్ పేమెంట్ సర్వీసులను ఉపయోగించడానికి, మీరు పేమెంట్‌లు చేయాలనుకుంటున్న బిల్లర్‌ల కోసం మీ బిల్లు ఖాతా సమాచారాన్ని, అలాగే (మీ కస్టమర్ ఖాతా నంబర్, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ లేదా కస్టమర్ ID వంటివి), సదరు బిల్లర్‌లతో మీ ఖాతా, బిల్లు/ప్లాన్ వివరాలను యాక్సెస్ చేయడానికి మాకు అవసరమైన ("బిల్ పేమెంట్ ఖాతా సమాచారం") వంటి ఏదైనా ఇతర సమాచారాన్ని మీరు మాకు అందించాల్సి రావచ్చు. బిల్ పేమెంట్ సర్వీసులను ఉపయోగించడం ద్వారా, మీకు బిల్ పేమెంట్ సర్వీసులను అందించడం కోసం మీ తరపున మీ బిల్ పేమెంట్ ఖాతా సమాచారం, బిల్లు వివరాలను కొనసాగింపు ప్రాతిపదికన యాక్సెస్ చేయడానికి, ఉపయోగించడానికి, స్టోర్ చేయడానికి మీరు Google Payకి స్పష్టంగా అధికారం ఇస్తున్నారు.

మీరు బిల్ పేమెంట్ ఖాతా సమాచారాన్ని అందించడానికి, బిల్లు వివరాలను పొందేందుకు లేదా మొబైల్ రీఛార్జ్‌లు/టాప్ అప్‌లతో సహా థర్డ్-పార్టీ తరపున పేమెంట్‌లు చేయడానికి బిల్ పేమెంట్ సర్వీసులను ఉపయోగిస్తే, అటువంటి వాటికి సదరు థర్డ్-పార్టీ సమ్మతి మీకు ఉందని నిర్ధారించుకోవడం మీ బాధ్యత. Google Pay, థర్డ్-పార్టీ బిల్ పేమెంట్ ఖాతా సమాచారాన్ని కొనసాగింపు ప్రాతిపదికన ఉపయోగించడానికి, Google Pay బిల్ పేమెంట్ సర్వీసులను అందించడం కోసం థర్డ్-పార్టీ తరపున సంబంధిత బిల్లర్ నుండి బిల్లు వివరాలను యాక్సెస్ చేయడానికి Google Payని అనుమతించడానికి మీకు అవసరమైన అన్ని హక్కులు, అనుమతులు ఉన్నాయని మీరు అంగీకరిస్తున్నారు. Google Payకి, మీకు మధ్య, థర్డ్-పార్టీ లేవనెత్తిన ఏదైనా దావా మీకు మాత్రమే వ్యతిరేకంగా ఉంటుందని మీరు అంగీకరిస్తున్నారు.

సమాచారపు ఖచ్చితత్వం. బిల్ పేమెంట్ ఖాతా సమాచారం, లావాదేవీ అమౌంట్‌తో సహా బిల్లును పొందడం మరియు/లేదా పేమెంట్ రిక్వెస్ట్ చేయడం కోసం మీరు అందించే సమాచారపు ఖచ్చితత్వానికి మీరే బాధ్యత వహించాలని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు.

గోల్డ్ ఖాతాను సెటప్ చేయడం. మీ గోల్డ్ ఖాతాను సెటప్ చేయడానికి, మీరు తప్పనిసరిగా (i) Googleకు అవసరమైన 2 ఫ్యాక్టర్ల ప్రామాణీకరణను పూర్తి చేయాలి; (ii) Google Payలో Google ప్రాంప్ట్ చేసిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కు అనుగుణంగా ఉండాలి; (iii) వర్తించే చట్టం ఆదేశించిన KYC ఆవశ్యకతలకు అనుగుణంగా ఉండాలి.

Google Payను ఉపయోగించడం ద్వారా, మీరు మీ గోల్డ్ ఖాతా మీ స్వంత పేరుతో సెటప్ చేయబడుతోందని, మీ పేరుతో మీకు ఒకటి కంటే ఎక్కువ గోల్డ్ ఖాతాలు లేవని నిర్ధారిస్తారు.

జీవితకాలంలో మొత్తం రూ.50,000 (భారతీయ రూపాయి యాభై వేలు) లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లను చేసినట్లయితే లేదా రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలను ప్రారంభించినట్లయితే, మీ PAN కార్డ్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. సదరు సందర్భంలో, మీరు మీ PAN కార్డ్ తాలూకు వాస్తవమైన కాపీని అందించారని, అది మోసం లేదా ట్యాంపరింగ్ చేయబడలేదని మీరు నిర్ధారిస్తున్నారు. క్యాష్‌బ్యాక్ అమౌంట్‌లపై పన్నులు పేమెంట్ చేయాల్సిన అనివార్యకార్యం ఏదైనా ఉంటే అది పూర్తిగా మీ బాధ్యత అని మీరు అంగీకరిస్తున్నారు.

సదరు విచారణలు చేయడానికి మీరు Googleకు అధికారం ఇస్తారు, ఎందుకంటే మీ ఐడెంటిటీ చెల్లుబాటుకు సంబంధించి వారు సంతృప్తి చెందాల్సిన అవసరం ఉంటుంది. మీ ప్రస్తుత సమాచారం లేదా మీరు అందించిన వెరిఫికేషన్ డాక్యుమెంట్‌లు మారినట్లయితే ఆ విషయమై Googleను అప్‌డేట్ చేయడానికి మీరు బాధ్యత వహిస్తారు.

మీ గోల్డ్ ఖాతాను సెటప్ చేసే సమయంలో Google మిమ్మల్ని నామినీ వివరాలు అడుగుతుంది. ఒకవేళ మీరు కాలం చేస్తే, మీ నామినీ, చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లను సమర్పించి, మీ గోల్డ్ ఖాతాలో ఉన్న బంగారాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.

6. పేమెంట్ పార్టిసిపెంట్‌లు, థర్డ్-పార్టీ ప్రొవైడర్‌లు

పేమెంట్ పార్టిసిపెంట్‌లతో కమ్యూనికేషన్‌లు. Google Pay వినియోగాన్ని మీరు ఎంచుకోవడం ద్వారా, లావాదేవీని ప్రాసెసింగ్ చేయడానికి లేదా Google Pay సర్వీసులను అందించడానికి లేదా రిస్క్ మేనేజ్‌మెంట్ కోసం, మోసాన్ని అంచనా వేయడం కోసం, పేమెంట్ పార్టిసిపెంట్‌లతో లేదా ఏదైనా థర్డ్-పార్టీ ప్రొవైడర్ లేదా సర్వీస్ ప్రొవైడర్‌తో సమాచారాన్ని అందించడానికి లేదా పొందడానికి, మీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా, Googleతో కమ్యూనికేట్ చేయడానికి మీరు Googleకు అధికారం ఇస్తున్నారు. పేమెంట్ పార్టిసిపెంట్‌లతో రిక్వెస్ట్ చేసే లేదా పేమెంట్ లావాదేవీని రిక్వెస్ట్ చేసే లేదా చేసే సమయంలో ఇతర యూజర్‌లకు, వ్యాపారులకు, బిల్లర్‌లకు మీరు పంపే ఏదైనా మెసేజ్‌ను కూడా అవసరమైనప్పుడు వర్తించే చట్టాలకు అనుగుణంగా Google షేర్ చేయవచ్చని మీరు అర్థం చేసుకున్నారు.

పేమెంట్ పార్టిసిపెంట్‌ల నియమాలకు అనుకూలత. మీ పేమెంట్ సూచనలను ప్రాసెస్ చేయడానికి మీరు పేమెంట్ పార్టిసిపెంట్‌ల సర్వీసులను ఉపయోగిస్తున్నందున, సంబంధిత పేమెంట్ పార్టిసిపెంట్‌లు ఎప్పటికప్పుడు జారీ చేసే నియమాలు, గైడ్‌లైన్స్, ఆదేశాలు, సూచనలు, రిక్వెస్ట్‌లు మొదలైన వాటికి మీరు సమ్మతిస్తారు, అంగీకరిస్తున్నారు ("పేమెంట్ పార్టిసిపెంట్ నియమాలు"). మిమ్మల్ని మీరు అప్‌డేట్ చేసుకోవడం, సదరు పేమెంట్ పార్టిసిపెంట్ నియమాలన్నింటిని పాటించడం మీ బాధ్యత అని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు. Google లేదా పేమెంట్ పార్టిసిపెంట్‌లు మీపై విధించిన అనివార్యకార్యాలను పాటించడంలో మీరు విఫలమైతే, మేము Google Payలో మీ Google ఖాతాను సస్పెండ్ చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. స్పష్టంగా తెలియజేయుట ఏమనగా, పేమెంట్ పార్టిసిపెంట్ రూల్స్ అనేవి మీకు, సంబంధిత పేమెంట్ పార్టిసిపెంట్‌కు మధ్య ఉంటాయి. సదరు పేమెంట్ పార్టిసిపెంట్‌లు చేసిన లేదా చేయని చర్యలు వేటికీ Google బాధ్యత వహించదు.

Google తాలూకు థర్డ్-పార్టీ ప్రొవైడర్‌ల వినియోగం కోసం. అదనంగా, Google Pay ("థర్డ్-పార్టీ ప్రొవైడర్‌ల") ద్వారా మీకు ప్రోడక్ట్‌లను లేదా సర్వీసులను అందించడానికి థర్డ్-పార్టీ ప్రొవైడర్‌లను Google ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఈ ప్రోడక్ట్‌లను లేదా సర్వీసులను ఉపయోగించడానికి, మీరు సదరు థర్డ్-పార్టీ ప్రొవైడర్‌ల నుండి అదనపు నియమాలను, షరతులను అంగీకరించవలసి ఉంటుంది, అలాగే థర్డ్-పార్టీ ప్రొవైడర్ తాలూకు అదనపు ఆవశ్యకతలకు లోబడి ఉండాల్సి రావచ్చు. ఈ సంయుక్త Google Pay నియమాలను అంగీకరించడం ద్వారా లేదా Google Pay సర్వీసుల వినియోగం కొనసాగించడం ద్వారా, మీరు Google Pay ద్వారా సదరు ప్రోడక్ట్‌లు, సర్వీసుల మీ వినియోగానికి వర్తించే థర్డ్-పార్టీ ప్రొవైడర్ నియమాలు వేటికైనా అంగీకరిస్తున్నారు, అవి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయబడవచ్చు. స్పష్టంగా తెలియజేయుట ఏమనగా, థర్డ్-పార్టీ ప్రొవైడర్ నియమాలు మీకు, వర్తించే థర్డ్-పార్టీ ప్రొవైడర్‌కు మధ్య ఉంటాయి తప్ప మీకు Googleకు మధ్య కాదు. సదరు థర్డ్-పార్టీ ప్రొవైడర్‌లు చేసిన లేదా చేయని చర్యలు వేటికీ Google బాధ్యులు కాదు.

7. ఫీజులు

పేమెంట్ పార్టిసిపెంట్‌లు లేదా థర్డ్-పార్టీ ఫీజులు. మీరు Google Pay వినియోగానికి సంబంధించి పేమెంట్ పార్టిసిపెంట్‌లు లేదా థర్డ్-పార్టీ ప్రొవైడర్‌ల నుండి యాక్సెస్‌కు లేదా డేటాకు సంబంధించిన ఫీజులను మీరు చెల్లించాల్సి రావచ్చు. అటువంటి ఫీజులన్నింటికీ మీరే బాధ్యులు.

Google ఫీజులు. మొబైల్ రీఛార్జ్‌లకు మాత్రమే పరిమితం కాకుండా కొన్ని లావాదేవీలు లేదా Google Pay సర్వీసుల వినియోగానికి ఫీజులు వర్తించవచ్చు. ప్రతి లావాదేవీని పూర్తి చేయడానికి ముందు, మీకు ఏవైనా ఫీజులు, వర్తింపజేయబడేవి ఉంటే, అవి వర్తించవచ్చు. ఫీజులను Google తన స్వంత విచక్షణ మేరకు నిర్ణయించవచ్చు, విధించబడిన ఫీజులు వేటిలో అయినా వర్తించే పన్నులన్నీ కలిసి ఉంటాయి.

8. Google Pay సర్వీసులను ఉపయోగించే లావాదేవీలు

Google Pay సర్వీస్ వినియోగంపై పరిమితులు. మేము లేదా పేమెంట్ పార్టిసిపెంట్‌లు Google Pay వినియోగానికి సంబంధించి సాధారణ పద్ధతులను, పరిమితులను ఏర్పాటు చేయవచ్చు. Google Pay తాలూకు ఏదైనా అంశాన్ని, Google Pay సర్వీసుల లేదా ఏదైనా Google Pay సర్వీస్ ఫీచర్ తాలూకు పని గంటలను లేదా లభ్యతను ఎటువంటి నోటీసు లేకుండా, బాధ్యత వహించకుండా ఎప్పుడైనా మార్చడానికి, సస్పెండ్ చేయడానికి లేదా నిలిపివేయడానికి మేము హక్కును కలిగి ఉంటాము. ఎటువంటి నోటీసు లేకుండా, బాధ్యత వహించకుండా నిర్దిష్ట ఫీచర్‌లపై పరిమితులను విధించడానికి గానీ, కొన్ని భాగాలకు లేదా మొత్తం సర్వీసుకు యాక్సెస్‌ను పరిమితం చేయడానికి గానీ విధించే హక్కును కూడా మేము కలిగి ఉంటాము. పేమెంట్‌లను పంపినవారికి లేదా గ్రహీతకు ముందస్తు నోటీసు లేకుండా ఏదైనా పేమెంట్ లావాదేవీని ప్రాసెస్ చేయడానికి మేము నిరాకరించవచ్చు. మేము స్పామ్ లేదా మోసపూరిత కమ్యూనికేషన్ అని భావించే ఏవైనా పేమెంట్ రిక్వెస్ట్‌లతో సహా Google Payకు చెందని ఖాతా నుండి యూజర్ స్వీకరించే ఏదైనా కమ్యూనికేషన్‌ను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసే హక్కును కూడా కలిగి ఉంటాము.

Google Payలో ఉన్న ఫంక్షన్‌లు అంతరాయం లేకుండా లేదా ఎర్రర్ లేకుండా ఉంటాయని మేము హామీ ఇవ్వము, (పేమెంట్ లావాదేవీల రసీదు, ప్రాసెసింగ్, అంగీకారం, పూర్తి చేయడం లేదా పరిష్కరించడంపై ప్రభావం చూపించే విద్యుత్ అంతరాయాలు, సిస్టమ్ వైఫల్యాలు లేదా ఇతర అంతరాయాలతో సహా కానీ వీటికే పరిమితం కాకుండా) ఏవైనా సర్వీసు అంతరాయాలు వేటికీ మేము బాధ్యత వహించము.

లావాదేవీ పరిమితులు. ప్రతి లావాదేవీ Google, యూజర్, పేమెంట్ పార్టిసిపెంట్‌లు లేదా వర్తించే చట్టంలోని నిబంధనల ప్రకారం నిర్దేశించబడిన కనిష్ఠ, గరిష్ఠ లావాదేవీ పరిమితులకు లోబడి ఉంటుంది. అదనంగా, Google, పేమెంట్ పార్టిసిపెంట్‌లు వారి సంబంధిత పాలసీలు, అంచనా ఆధారంగా Google Payలో మీ Google ఖాతాలో లావాదేవీలను (పూర్తిగా లేదా పాక్షికంగా) తిరస్కరించవచ్చు/సస్పెండ్ చేయవచ్చు.

లావాదేవీ రికార్డ్‌లు. మీ లావాదేవీల రికార్డ్‌లు మీ సంభాషణ హిస్టరీలో, మీ Google Pay యాప్‌లోని లావాదేవీల హిస్టరీలో ప్రతిబింబిస్తాయి. ఏవైనా ఎర్రర్‌లు లేదా అనధికారిక లావాదేవీలు ఉన్నాయో లేదో నిర్ధారించడానికి మీ లావాదేవీ యాక్టివిటీని రివ్యూ చేయాల్సిన బాధ్యత మీదే, సదరు ఈవెంట్ గురించి సంయుక్త Google Pay నియమాలకు అనుగుణంగా Googleకు అలర్ట్ పంపే బాధ్యత మీపై ఉంటుంది.

వర్చువల్ ఖాతా నంబర్‌లతో లావాదేవీలు. మీరు Google Payని ఉపయోగించి వర్చువల్ ఖాతా నంబర్ పేమెంట్ లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లావాదేవీని ప్రారంభించినప్పుడు, Google మీ వర్చువల్ ఖాతా నంబర్, సంబంధిత సమాచారాన్ని లావాదేవీ చేసే పార్టీకి పంపవచ్చు, తద్వారా మీ పేమెంట్ ఆప్షన్‌కు ఛార్జీ విధించవచ్చు. మీరు ఇలా చేసినప్పుడు వర్చువల్ ఖాతా నంబర్ లావాదేవీ ప్రారంభం కావచ్చు: NFC, స్కాన్ బార్‌కోడ్‌లు లేదా QR కోడ్‌లు లేదా ఇతర స్పర్శరహిత టెక్నాలజీని ఉపయోగించి స్టోర్‌లలో లేదా ట్రాన్సిట్ సర్వీసులలో ట్యాప్ చేసి పేమెంట్ చేయండి; థర్డ్-పార్టీ తాలూకు వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఆన్‌లైన్ లావాదేవీలో పేమెంట్ ఆప్షన్‌గా "Google Pay"ని లేదా "Google Payతో కొనండి"ని ఎంచుకోండి; లేదా Google Assistant వంటి ఇతర ఆన్‌లైన్ ఇంటర్‌ఫేస్ ద్వారా థర్డ్-పార్టీతో లావాదేవీలు జరపండి. మీరు ఆన్‌లైన్ లావాదేవీని ప్రారంభించినప్పుడు, లావాదేవీని పూర్తి చేయడానికి సంబంధించిన బిల్లింగ్, షిప్పింగ్ లేదా మీ Google ఖాతాలో సేవ్ చేయబడిన ఈమెయిల్ అడ్రస్ వంటి ఇతర సమాచారాన్ని కూడా Google Pay షేర్ చేయవచ్చు.

పేమెంట్ ఆప్షన్, ఇతర వివరాలను థర్డ్-పార్టీకి పంపిన తర్వాత, మీకు, థర్డ్-పార్టీకి మధ్య జరిగే లావాదేవీలో Googleకు ఎలాంటి ప్రమేయం ఉండదు, అలాంటి లావాదేవీ మీకు, థర్డ్-పార్టీకి మధ్య మాత్రమే జరుగుతుంది తప్ప Googleతో గానీ లేదా దాని అనుబంధ సంస్థలలో దేనితోనైనా గాని కాదని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు. రీఫండ్‌లు, వివాదాలతో సహా వర్చువల్ ఖాతా నంబర్ లావాదేవీలకు సంబంధించిన ఏవైనా సమస్యలకు సంబంధించి మీరు నేరుగా థర్డ్-పార్టీని గాని లేదా మీ పేమెంట్ ఆప్షన్ ప్రొవైడర్‌ను గాని (ఉదాహరణకు, మీ పేమెంట్ ఆప్షన్‌ను జారీ చేసే సంస్థను) సంప్రదించాలి.

Google Payలో చక్కగా రూపొందించిన లావాదేవీ వివరాలను, మీ ఇటీవలి లావాదేవీల హిస్టరీని డిస్‌ప్లే చేయడానికి మీ పేమెంట్ ఆప్షన్‌ను జారీ చేసే సంస్థ నుండి లావాదేవీల లొకేషన్ సమాచారంతో సహా లావాదేవీ సమాచారాన్ని Google Pay స్వీకరించవచ్చని మీరు అంగీకరిస్తున్నారు.

అనుమతించదగిన లావాదేవీలు. వస్తువులు, సర్వీసుల కొనుగోలుతో సహా చట్టబద్ధమైన, విశ్వసనీయ ప్రయోజనాల కోసం పేమెంట్ చేయడానికి మీరు లావాదేవీని ప్రాసెస్ చేయడానికి మాత్రమే Google Pay సర్వీసులను ఉపయోగించవచ్చు. ఏదైనా చట్టవిరుద్ధమైన వస్తువులు లేదా సర్వీసుల విక్రయం లేదా మార్పిడికి సంబంధించి పేమెంట్ లావాదేవీలను లేదా ఏదైనా ఇతర చట్టవిరుద్ధమైన లావాదేవీని ప్రాసెస్ చేయడానికి మీరు Google Pay సర్వీసును ఉపయోగించకూడదు.

సంయుక్త Google Pay నియమాలు, పేమెంట్ పార్టిసిపెంట్‌ల నియమాలు, వర్తించే చట్టం లేదా Google Pay సర్వీసులకు వర్తించే ఇతర పాలసీలు లేదా నియమాలను ఉల్లంఘించే లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి మీరు Google Pay సర్వీసును ఉపయోగించకూడదని మీరు అంగీకరిస్తున్నారు. Google Pay లావాదేవీలకు సంబంధించి మీ హక్కులను, అనివార్యకార్యాలను అర్థం చేసుకోవడానికి మీరు Google Pay పాలసీలను రివ్యూ చేయాలి. మీరు Google Pay పాలసీలు పేమెంట్‌లు చేయడానికి లేదా స్వీకరించడానికి Google Pay సర్వీసులను ఏయే సందర్భాలలో ఉపయోగించకూడదో స్పష్టంగా తెలియజేస్తాయి. మీరు Google Pay పాలసీలను పాటించడంలో విఫలమైతే, దానిలో పేర్కొన్న పరిమితుల ఫలితంగా మీ లావాదేవీ తిరస్కరించబడవచ్చు లేదా మీ Google Pay సర్వీస్ సస్పెండ్ కావచ్చు లేదా రద్దు కావచ్చు.

మీరు Google Pay సర్వీసుల్లో భాగంగా బిజినెస్ పేజీలను హోస్ట్ చేస్తే, మీరు ఈ బిజినెస్ పేజీలను (a) చట్టవిరుద్ధమైన ప్రయోజనాల కోసం లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సపోర్ట్‌ చేయడానికి గానీ; (b) అక్రమ లావాదేవీని ప్రోత్సహించడానికి లేదా విక్రయించడానికి లేదా నిషేధిత ఉత్పత్తులు లేదా సేవలను విక్రయించడానికి గానీ; (c) Google Pay పాలసీలు, బిజినెస్‌ల కోసం Google Pay పాలసీలు లేదా Play పాలసీ కింద నిషేధించబడిన కంటెంట్ లేదా యాక్టివిటీలకు సంబంధించి గానీ; (d) మీ యాక్టివిటీ Google ద్వారా ఆమోదించబడిందని సూచించే విధంగా గానీ; (e) Google ప్రతిష్టను లేదా గుడ్‌విల్‌ను దెబ్బతీసే విధంగా గానీ; లేదా (f) వర్తించే చట్టానికి అనుగుణంగా లేకుండా గానీ ఉపయోగించకూడదు.

Google ఏ సమయంలోనైనా, మీరు పైన పేర్కొన్న వాటికి అనుగుణంగా ఉన్నట్లు రాతపూర్వకంగా ధృవీకరించవలసి ఉంటుంది, మీరు ఎప్పటికప్పుడు Googleకు అవసరమైన సదరు సహాయక డాక్యుమెంట్‌లతో పాటు సదరు రాతపూర్వక సర్టిఫికేషన్‌ను అందించాలి.

9. Google Payలో బిల్ పేమెంట్

బిల్ వినియోగం. మీరు మీ Google Pay యాప్‌లో బిల్లర్‌ను రిజిస్టర్ చేసిన తర్వాత, ఆ బిల్లర్ నుండి వచ్చే మీ ప్రస్తుత అలాగే రాబోయే బిల్లు వివరాలను లేదా అర్హత ఉన్న రీఛార్జ్ ప్లాన్‌లను లేదా స్టేట్‌మెంట్‌ను అందుబాటులో ఉన్నప్పుడు మీరు చూడవచ్చు. ఏదైనా పేమెంట్‌లు చేయడానికి ముందు మీరు మీ బిల్లు వివరాలను జాగ్రత్తగా చూసుకున్నారని నిర్ధారించుకోండి. ఏవైనా వ్యత్యాసాలు ఉంటే, దయచేసి మీ బిల్లర్‌ను సంప్రదించండి.

మీ బిల్ పేమెంట్‌లను షెడ్యూల్ చేస్తోంది. మీరు ఎంచుకున్న బిల్లర్‌పై ఆధారపడి పేమెంట్ రియలైజేషన్ సమయం మారుతుంది. Google Pay మీ నుండి పేమెంట్ సూచనను స్వీకరించినప్పుడు, మీ ఫండింగ్ ఖాతా నుండి డెబిట్ చేయడానికి, మీ తరపున సదరు బిల్లర్‌కు పేమెంట్‌ను పంపడానికి పేమెంట్‌ల సిస్టమ్ ప్రొవైడర్‌లకు సూచనలను పంపడానికి మీరు మాకు అధికారం ఇస్తున్నారు. పేమెంట్‌లు అటువంటి బిల్లర్‌లు, పేమెంట్ పార్టిసిపెంట్‌ల పాలసీలకు, విధానాలకు లోబడి ఉంటాయి. (i) బిల్లర్ ద్వారా పేమెంట్ రియలైజేషన్‌లో ఆలస్యానికి; (ii) లావాదేవీల ఆలస్యం, వైఫల్యం లేదా రివర్స్; లేదా (iii) పేమెంట్ తేదీలను సకాలంలో షెడ్యూల్ చేయడంలో మీ వైఫల్యానికి మేము బాధ్యులము కాము. లేట్ పేమెంట్ ఫీజు ఛార్జ్ లెవీ లేదా సదరు బిల్లర్ ద్వారా ఏదైనా ఇతర పెనాల్టీతో సహా లేట్ పేమెంట్ కారణంగా ఏర్పడే ఏవైనా పరిణామాలకు మీరే బాధ్యత వహిస్తారు.

బిల్ రిమైండర్‌లు. బిల్లు పేమెంట్ ఆవశ్యకతలకు సంబంధించిన మీ స్వంత రికార్డ్‌లతో పాటు, మీ బిల్లును పేమెంట్ చేయడానికి Google Pay మీకు రిమైండర్‌లను కూడా పంపవచ్చు. ఇది మీ బిల్లు పేమెంట్‌లను సకాలంలో షెడ్యూల్ చేయడంలో మీకు సహాయం చేస్తుంది.

పేమెంట్ హిస్టరీ. మీరు Google Pay యాప్ ద్వారా మీ బిల్లు పేమెంట్ రిక్వెస్ట్‌ల గురించిన సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. బిల్లర్ అందించిన ఏవైనా స్టేట్‌మెంట్‌లు లేదా పేమెంట్ రికార్డ్‌లకు సంబంధించి మీరు మీ బిల్లు పేమెంట్ రిక్వెస్ట్‌లను ఎల్లప్పుడూ వెరిఫై చేయాలి, నిర్ధారించాలి.

ప్రీపెయిడ్ రీఛార్జీలు. Google Pay మీ ప్రీపెయిడ్ మొబైల్, డేటా లేదా ఇతర ఖాతాల రీఛార్జ్‌ను సులభతరం చేస్తుంది. అసలు మొబైల్ డేటా గానీ ఏదైనా ఇతర సర్వీస్ గానీ మీరు ఖాతా కలిగి ఉన్న టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్ వంటి ప్రీపెయిడ్ సర్వీస్ ప్రొవైడర్‌ల ("ప్రీపెయిడ్ సర్వీస్ ప్రొవైడర్‌లు") ద్వారా లేదా వారి పంపిణీదారులు, అగ్రిగేటర్ల ద్వారా అందించబడుతుంది, Google Pay ద్వారా కాదు. ప్రీపెయిడ్ సర్వీస్ ప్రొవైడర్‌లు అందించే సముచితమైన ప్లాన్‌ను ఎంచుకోవడానికి, దాని నియమాలను పాటించడానికి మీరు పూర్తిగా బాధ్యత వహిస్తారని మీరు ఇందుమూలంగా అంగీకరిస్తున్నారు. Google Payలో అందించబడిన ప్లాన్‌లు కేవలం రెఫరెన్స్ ప్రయోజనాల కోసం మాత్రమే అని మీరు అర్థం చేసుకున్నారు. ప్లాన్‌లు అప్‌డేట్ అయ్యి ఉండకపోవచ్చు, మార్చబడి ఉండవచ్చు. మీరు లావాదేవీ చేయడానికి ముందు తాజా ప్లాన్‌లు, వివరాల కోసం మీ ప్రీపెయిడ్ సర్వీస్ ప్రొవైడర్‌తో చెక్ చేయాలి.

అడ్-హాక్ బిల్ పేమెంట్‌లు. బిల్లు పేమెంట్ కోసం లేదా రీఛార్జ్ కోసం మీరు అడ్-హాక్ అమౌంట్‌ను (తాత్కాలిక మొత్తాన్ని) ఎంటర్ చేయవచ్చు. అయితే దానిని ఆమోదించడం అన్నది పూర్తిగా బిల్లర్ విచ‌క్షణ‌పై ఆధారపడి ఉంటుంది. పేమెంట్ చేసేందుకు లేదా మీ ఖాతాను రీఛార్జ్ చేసేందుకు ఎంటర్ చేసే వివరాల ఖచ్చితత్వానికి మీదే బాధ్యత. రీఛార్జ్ లేదా ఇతర బిల్లు పేమెంట్‌ను అమలు చేయడంలో బిల్లర్ తాలూకు ఏదైనా వైఫల్యానికి లేదా బిల్లర్ అందించిన సర్వీస్ క్వాలిటీకి సంబంధించిన ఏదైనా సమస్యకు Google Pay బాధ్యులు కాదని మీరు ఇంకా అంగీకరిస్తున్నారు. దానికి సంబంధించిన ఏదైనా వివాదం మీకు, బిల్లర్‌కు మధ్య నేరుగా పరిష్కరించబడుతుంది.

రీఫండ్‌లు. మొబైల్ రీఛార్జ్‌తో సహా, మీ ఖాతా నుండి డెబిట్ చేయబడి బిల్లు పేమెంట్ లేదా రీఛార్జ్ డెలివరీ జరగని ఏదైనా పేమెంట్ కోసం పేమెంట్ అమౌంట్‌ను రీఫండ్ చేయడం అనేది, బిల్లర్ తాలూకు నియమాలు లేదా పాలసీల ప్రకారం మాత్రమే చేయబడుతుందని, దానికి Google Pay బాధ్యత వహించదని మీరు అంగీకరిస్తున్నారు.

10. Google Payలో లోన్ సదుపాయం సర్వీసులు

లోన్ సదుపాయం ఆఫర్‌లు. మీకు అర్హత ఉన్న లోన్ సదుపాయాలకు సంబంధించిన ఆఫర్‌లను లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీలు మీకు పంపవచ్చని మీరు అంగీకరిస్తున్నారు. లోన్ సదుపాయ నియమాలు, పరిమాణంతో సహా లోన్ సదుపాయాన్ని వినియోగించుకోడానికి మీ అర్హతను, లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీ తన స్వంత విచక్షణ మేరకు నిశ్చయిస్తుందని మీరు అంగీకరిస్తున్నారు. సదరు ఆఫర్ తాలూకు కంటెంట్‌కు లేదా లోన్ సదుపాయానికి Google బాధ్యత వహించదు. Google పని చేసే లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీలు, వారి సర్వీస్ నియమాలు ఇక్కడ చూడవచ్చు:

- DMI ఫైనాన్స్

- Aditya Birla ఫైనాన్స్ లిమిటెడ్

- Bajaj ఫైనాన్స్

- Axis బ్యాంక్

లోన్ సదుపాయం సర్వీసుల కోసం దరఖాస్తు చేయడం. లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీలు మీకు అందించే లోన్ సదుపాయం కోసం దరఖాస్తు చేసుకోవడానికి, మీరు ఆఫర్‌ను అంగీకరించి, Google Payలో లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీ అందించిన లోన్ దరఖాస్తును పూరించాలి. లోన్‌లు మంజూరు చేసే సంబంధిత థర్డ్-పార్టీపై ఆధారపడి, మీరు దాని టెన్యూర్‌తో సహా మీ ప్రాధాన్య లోన్ సదుపాయం అమౌంట్‌ను, సమాన నెలవారీ వాయిదాల ("EMI") ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఇంకా, మీరు మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, IP అడ్రస్, మీరు ఎంచుకున్న లోన్ అమౌంట్, టెన్యూర్, EMI ప్లాన్, లోన్ తాలూకు ఉద్దేశ్యం, ఇతర సమాచారంతో సహా లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీకి అవసరం అయ్యే నిర్దిష్ట వ్యక్తిగత సమాచారాన్ని అందించాల్సి రావచ్చు.

Google Pay యాప్‌లో లోన్ సదుపాయం సర్వీసుల కోసం దరఖాస్తు చేసే సమయంలో లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీలతో మీ KYC వివరాలు తాజావి, ఖచ్చితమైనవని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది.

మీరు మీ లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీ నుండి లోన్ సదుపాయం సర్వీసులను పొందుతున్నారని, ఈ ప్రయోజనం కోసం లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీతో లోన్ ఒప్పందం కుదుర్చుకుంటున్నారని మీరు అర్థం చేసుకున్నారు. లోన్ సదుపాయం ఆఫర్ చేయడంలో గానీ లేదా లోన్ ఒప్పందం అమలులో గానీ లేదా Googleకు ఎటువంటి ప్రమేయం లేదు, బాధ్యులు కాదు.

ఫీజులు, ఛార్జీలు. లోన్ సదుపాయం, స్టాంప్ డ్యూటీ ఛార్జీల తక్షణ ప్రాసెసింగ్ కోసం లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీ మీ నుండి సర్వీస్ ఫీజును వసూలు చేయవచ్చని మీరు అర్థం చేసుకున్నారు, ఈ విష‌యం లోన్ దరఖాస్తులో పేర్కొనబడుతుంది, లోన్ ఫెసిలిటీ అమౌంట్ నుండి ఈ ఫీజు తీసివేయ‌బ‌డుతుంది.

మీ లోన్ దరఖాస్తును జాగ్రత్తగా రివ్యూ చేయండి. మీరు లోన్ ఒప్పందంలోని అన్ని నియమాలను అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోవడం, దరఖాస్తును పూర్తి చేసి సమర్పించే ముందు వడ్డీ రేటు, EMI ప్లాన్, లోన్ సదుపాయం తాలూకు ఇతర ఛార్జీలతో సహా వాటిని జాగ్రత్తగా రివ్యూ చేసుకోవడం మీ బాధ్యత. దయచేసి మీరు లోన్ సదుపాయం కోసం దరఖాస్తు చేసే సమయంలో మీరు అందించిన లోన్ సదుపాయం సమాచారం అంతటినీ రివ్యూ చేశారని, అది మొత్తం సరిగ్గానే ఉందని నిర్ధారించుకోండి. వర్తించే విధంగా EMI, సర్వీస్ ఫీజులు, స్టాంప్ డ్యూటీల తాలూకు తుది అమౌంట్‌లు అనేవి లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీ ద్వారా నిర్ణయించబడతాయని దయచేసి గమనించండి. దరఖాస్తు ప్రక్రియలో లేదా లోన్ ఒప్పందం తాలూకు పనితీరులో మీరు నిర్ధారించిన ఏదైనా లోపం లేదా వ్యత్యాసానికి Google బాధ్యత వహించదు. ఏదైనా వ్యత్యాసాన్ని సరిదిద్దడానికి, మీరు లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీతో నేరుగా ఎంగేజ్ కావాలి.

లోన్ ఫెసిలిటీ వివరాలు చూపించడం. లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీ మీ దరఖాస్తును ఆమోదించిన తర్వాత, మీరు Google Pay యాప్‌లో ("లోన్ సదుపాయం రసీదు") లోన్ సదుపాయం కోసం రసీదును చూడవచ్చు. లోన్ సదుపాయం రసీదులో మీ పేరు, అడ్రస్, దరఖాస్తు తేదీ, లోన్ సదుపాయం అమౌంట్, వడ్డీ రేటు, టెన్యూర్, EMIల సంఖ్య, ఫీజులు, ఛార్జీలు ఇంకా లోన్ దరఖాస్తు ప్రక్రియలో మీరు అందించిన లేదా నిర్ధారించిన ఇతర వివరాల వంటి సమాచారం ఉండవచ్చు. లోన్ సదుపాయం రసీదులో ఏదైనా వ్యత్యాసం ఉంటే, దానిని లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీతో పరిష్కరించుకోవాలి.

లోన్ సదుపాయం అమౌంట్ పంపిణీ. లోన్ సదుపాయం అమౌంట్ నేరుగా లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీతో ఉన్న మీ ఖాతాలో క్రెడిట్ చేయబడుతుంది.

EMI పేమెంట్ రిమైండర్‌లు. మీ లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీ మీ EMI పేమెంట్ కోసం పంపే రిమైండర్‌లతో సహా లోన్ సదుపాయానికి సంబంధించిన కమ్యూనికేషన్‌లను Google Pay యాప్ ద్వారా పంపవచ్చని మీరు అంగీకరిస్తున్నారు.

లోన్ సదుపాయం అమౌంట్ రీపేమెంట్. EMI గడువు తేదీన, మీకు లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీ వారి వద్ద ఉన్న మీ ఖాతా నుండి EMI పేమెంట్ అమౌంట్‌ను స్వయంగా డెబిట్ చేసుకుంటుంది. మీ ఖాతాలో తగినంత నిధులను ఉంచడానికి, లోన్ ఒప్పందం అమలు లేదా EMI ఆవశ్యకతల కోసం నిధులు చాలకపోవడం వల్ల ఎదుర్కోవాల్సిన పరిణామాలకు, లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీతో మీరు ఎగ్జిక్యూట్ చేసిన లోన్ ఒప్పందం నియమాల ప్రకారం వడ్డీ లెవీతో సహా, మీరు బాధ్యత వహించాలి.

Google Payలో లోన్ సదుపాయం సర్వీసులను పొందడం ద్వారా, మీకు సర్వీసులను అందించడానికి Google Payలో మీ తరఫున లోన్ సదుపాయం లావాదేవీ సమాచారాన్ని కొనసాగింపు ప్రాతిపదికన యాక్సెస్ చేయడానికి, ఉపయోగించడానికి, స్టోర్ చేయడానికి మీరు స్పష్టంగా Google Payకి అధికారం ఇస్తారు.

11. Google Payలో క్రెడిట్ కార్డ్ సర్వీసులు

మీరు అర్హులైన క్రెడిట్ కార్డ్‌లు, సంబంధిత ఆఫర్‌లు లేదా సర్వీసులకు సంబంధించిన ఆఫర్‌లను Google లేదా క్రెడిట్ సంస్థలు మీకు పంపవచ్చని మీరు అంగీకరిస్తున్నారు. క్రెడిట్ కార్డ్ కోసం మీ అర్హత అనేది క్రెడిట్ సంస్థ తన స్వంత విచక్షణ మేరకు, బ్యాంక్ అభివృద్ధి చేసిన దాని సంప్రదాయ విధానాలు, క్రెడిట్ అండర్‌రైటింగ్ ప్రమాణాల ఆధారంగా ఉంటుందని, క్రెడిట్ సంస్థ తాలూకు స్వంత విచక్షణ మేరకు లోబడి ఆమోదం గానీ లేదా నిరాకరణ గానీ ఉంటుందని మీరు ధృవీకరిస్తున్నారు.

క్రెడిట్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేయడం. క్రెడిట్ సంస్థ ద్వారా మీకు అందించే క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి, సదరు క్రెడిట్ సంస్థ అందించిన దరఖాస్తును మీరు Google Payలో సమర్పించాలి. మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, ఆదాయ పరిధి, ఉపాధి సమాచారంతో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా, సదరు క్రెడిట్ సంస్థకు అవసరమయ్యే ఇతర సమాచారంతో సహా నిర్దిష్ట వ్యక్తిగత సమాచారాన్ని మీరు అందించాల్సి ఉంటుంది. మీరు Google Pay యాప్‌లో క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో క్రెడిట్ సంస్థల వద్ద ఉన్న మీ KYC వివరాలు తాజావేనని, ఖచ్చితమైనవని నిర్ధారించుకోవడం మీ బాధ్యత.

మీరు మీ క్రెడిట్ సంస్థ నుండి క్రెడిట్ కార్డ్‌ను పొందుతున్నారని, ఈ ప్రయోజనం కోసం మీరు క్రెడిట్ సంస్థతో ఒప్పందంలోకి ప్రవేశిస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు. క్రెడిట్ కార్డ్‌ను మీకు ఆఫర్ చేయడంలో గానీ లేదా అందించడంలో గానీ Googleకు ఎటువంటి ప్రమేయం లేదు, బాధ్యులు కాదు.

మీ క్రెడిట్ కార్డ్ దరఖాస్తును జాగ్రత్తగా రివ్యూ చేయండి. దరఖాస్తును పూర్తి చేసి సమర్పించే ముందు, మీకు, మీ క్రెడిట్ సంస్థకు మధ్య క్రెడిట్ కార్డ్ ఒప్పందం ప్రకారం మీ క్రెడిట్ కార్డ్‌ను నియంత్రించే అన్ని నియమాలను మీరు అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోవడం మీ బాధ్యత. దరఖాస్తు ప్రక్రియలో మీ నిర్ధారణలో ఏదైనా ఎర్రర్ లేదా వ్యత్యాసం చోటు చేసుకుని ఉంటే దానికి గానీ, క్రెడిట్ కార్డ్ అందించడం లేదా క్రెడిట్ కార్డ్‌కు సంబంధించి క్రెడిట్ సంస్థ అందించిన ఏవైనా సమాచారం తాలూకు ఖచ్చితత్వానికి గానీ Google బాధ్యత వహించదు. మీ క్రెడిట్ కార్డ్‌కు సంబంధించిన ఏదైనా వ్యత్యాసాన్ని సరిదిద్దడానికి గానీ, లేదా మీ క్రెడిట్ కార్డ్‌ను మూసివేయడానికి లేదా రద్దు చేయడానికి గానీ, క్రెడిట్ సంస్థతో మీ క్రెడిట్ కార్డ్ ఒప్పందం తాలూకు నియమాల ప్రకారం నేరుగా మీరు క్రెడిట్ సంస్థతో వ్యవహరించాల్సి ఉంటుంది.

Google Payలో క్రెడిట్ కార్డ్ సర్వీసులను ఉపయోగించుకోవడం ద్వారా, మీ క్రెడిట్ కార్డ్‌కు సంబంధించిన ఆఫర్‌లు, మీరు అర్హులైన సంబంధిత ఆఫర్‌లు లేదా సర్వీసులను మీకు పంపడంతో సహా, Google Payలో మీకు సర్వీసులను అందించే ప్రయోజనం కోసం, మోసం గురించిన ఎనలిటిక్స్‌కు, మోసాన్ని తగ్గించే ప్రయత్నాలకు సహాయం చేయడం కోసం మీ క్రెడిట్ కార్డ్ దరఖాస్తు సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, ఉపయోగించడానికి, స్టోర్ చేయడానికి మీరు Google Payకి స్పష్టంగా అధికారం ఇస్తున్నారు.

12. క్రెడిట్ రిపోర్ట్

ప్రామాణీకరణ: మీరు మీ వివరాలను అందించడం అలాగే Google Payలో కొనసాగించండిపై క్లిక్ చేయడం ద్వారా వీటికి అంగీకరిస్తున్నారు

  1. మీ క్రెడిట్ సమాచారం కోసం రిక్వెస్ట్ చేస్తున్నారని;
  2. మీ ఐడెంటిటీని వెరిఫై చేయడానికి, Google Payలో మీరు అందించిన వివరాలను రిక్వెస్ట్ చేయబడినప్పుడల్లా TransUnion CIBIL Limited (“TUCIBIL”, క్రెడిట్ బ్యూరో)తో ఎప్పటికప్పుడు షేర్ చేయడానికి, 'ఎండ్ యూజర్ అనుమతి ప్రయోజనం' కోసం మీ క్రెడిట్ సమాచారాన్ని పొందేందుకు Googleను మీ అధీకృత ప్రతినిధిగా నియమించడానికి మీ సమ్మతిని అందించారు;
  3. a) మీ ఖాతా Google Payలో డీయాక్టివేట్ చేయబడే వరకు, b) 'ఎండ్ యూజర్ అనుమతించిన ప్రయోజనం' కోసం మీ క్రెడిట్ సమాచారం అవసరమయ్యే సమయం వరకు, c) 6 నెలల పరిమిత కాలం పాటు, d) Google Payలో మీ క్రెడిట్ సమాచారాన్ని స్టోర్ చేయడానికి/ఉపయోగించడానికి మీ సమ్మతిని ఉపసంహరించుకునే వరకు, ఏది ముందుగా జరిగితే అంత వరకు, మీ క్రెడిట్ సమాచార నిల్వ కొనసాగింపునకు, స్టోర్ చేయడానికి Google కు అధికారం ఇచ్చారు; అలాగే
  4. Google Pay యాప్‌లో క్రెడిట్ సమాచారాన్ని మరింత అందంగా, యూజర్-ఫ్రెండ్లీగా చేయడానికి, ఎటువంటి మార్పులు చేయకుండా, కేవలం దాన్ని మళ్లీ అమర్చడానికి, బక్కెట్ చేయడానికి మాత్రమే మీరు Googleకు అధికారం ఇచ్చారు.

క్రెడిట్ స్కోర్ సిమ్యులేటర్: క్రెడిట్ స్కోర్ సిమ్యులేటర్ అనేది యూజర్‌లు ఎంచుకున్న సందర్భాల ఆధారంగా సంభావ్య స్కోర్ తాలూకు సూచికగా మాత్రమే ఉపయోగించబడుతుంది. క్రెడిట్ స్కోర్ సిమ్యులేటర్ ఒక ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ప్రోడక్ట్ అని క్రెడిట్ స్కోర్ సిమ్యులేటర్ లేదా దాని నుండి ఉత్పన్నమయ్యే సిమ్యులేటెడ్ క్రెడిట్ స్కోర్ పనితీరులో Google ఎటువంటి పాత్ర పోషించదని మీరు అర్థం చేసుకున్నారు.

నిరాకరణ:

(i) Google Pay మీ క్రెడిట్ సమాచారం, TUCIBIL అందించిన క్రెడిట్ స్కోర్ సిమ్యులేటర్ డిస్‌ప్లే కోసం ఒక టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది, మీ క్రెడిట్ సమాచారాన్ని లేదా సిమ్యులేటెడ్ స్కోర్‌ను కంట్రోల్ చేయదు. క్రెడిట్ నిర్ణయాలు తీసుకోవడానికి సిమ్యులేటెడ్ స్కోర్ మీద ఆధారపడకూడదు, విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే దానిని రెఫర్ చేయాలి.

(ii) మీ క్రెడిట్ రిపోర్ట్‌లోని ఏదైనా సమాచారం తప్పుగా ఉండి మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంటే, TUCIBIL అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివాదంలో నేరుగా దానిని ప్రశ్నించే హక్కు మీకు ఉంటుంది.

13. Google Payలో UPI Lite సర్వీసులు

UPI Lite అనేది NPCI ద్వారా సులభతరం చేయబడిన, Google Pay యాప్‌లో ఎనేబుల్ చేయబడిన ఒక సర్వీసు, దీని ద్వారా మీరు మీ UPI Lite ఖాతా (“UPI Lite”)ను ఉపయోగించి దిగువ 'వినియోగం, సెటిల్‌మెంట్' విభాగంలో సూచించిన పరిమితి వరకు UPI PIN ఎంటర్ చేయకుండానే తక్కువ విలువ గల పేమెంట్ లావాదేవీలు చేయవచ్చు. UPI Lite అనేది Google Pay యాప్‌లో కేవలం ఒక సర్వీసుగా అందించబడుతుంది, కొత్త ఖాతా లేదా వాలెట్ కాదు. మీరు మీ మొబైల్ పరికరాన్ని మార్చినప్పటికీ, మీరు అదే ఫోన్ నంబర్‌ను, బ్యాంక్ ఖాతాను ఉపయోగిస్తున్నట్లయితే, మీ కొత్త పరికరం నుండి మీ UPI Lite ఖాతా బ్యాలెన్స్‌ను యాక్సెస్ చేయడం కొనసాగించగలరని మీరు అర్థం చేసుకున్నారు.

రిజిస్ట్రేషన్, లోడింగ్: UPI Lite కోసం ఇలా రిజిస్టర్‌ చేసుకోవచ్చు: మీ ప్రొఫైల్ చిహ్నాన్ని క్లిక్ చేసి, పేమెంట్ ఆప్షన్‌ల పేజీలో UPI Liteను సెటప్ చేస్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్‌లో భాగంగా, UPI Lite (“బ్యాంక్ ఖాతా”)ను సపోర్ట్ చేసే మీ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా ద్వారా మీ UPI Lite ఖాతాకు INR 2000 వరకు జోడించమని మీకు ప్రాంప్ట్ వస్తుంది. మీరు మీ UPI PINను విజయవంతంగా ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసినప్పుడు, డబ్బు మీ UPI Lite ఖాతాలో జమ చేయబడినప్పుడు UPI Lite కోసం రిజిస్ట్రేషన్ చేయడం పూర్తయినట్లుగా పరిగణించబడుతుంది. UPI Liteకు సపోర్ట్ చేసే ఒకే ఒక బ్యాంక్ ఖాతాను మాత్రమే Google Pay యాప్‌లో UPI Liteకు లింక్ చేయడానికి ఉపయోగించవచ్చని మీరు అర్థం చేసుకున్నారు.

వినియోగం, సెటిల్‌మెంట్: మీరు మీ UPI Lite ఖాతాను ఉపయోగించి ఒక వ్యక్తికి లేదా వ్యాపారికి గరిష్ఠంగా రూ. 500 పేమెంట్ లావాదేవీని చేయవచ్చు. UPI Lite ఖాతా మొత్తం రోజువారీ వినియోగ పరిమితి రూ. 4000కు పరిమితం చేయబడుతుంది, గరిష్ఠంగా రూ 2000 రోజుకు రెండుసార్లు జోడించవచ్చు. మీకు కింది విషయాలు అర్థం అయ్యాయి:

  1. NPCI తన స్వంత విచక్షణ మేరకు పైన పేర్కొన్న వినియోగ పరిమితులను ఎప్పటికప్పుడు మీకు ముందస్తుగా తెలియజేయకుండానే తిరిగి పరిశీలించవచ్చని మీరు అర్థం చేసుకున్నారు.
  2. UPI Lite ఖాతా అనేది పరికరంలో మాత్రమే ఉండే వర్చువల్ బ్యాలెన్స్, అది మీరు కేటాయించిన UPI Lite బ్యాలెన్స్ తాలూకు ప్రతిబింబం మాత్రమే. UPI Lite ఖాతా బ్యాలెన్స్‌పై మీకు ఎటువంటి వడ్డీ చెల్లించబడదు.
  3. మీ UPI Lite ఖాతాకు సంబంధించిన అసలు డబ్బు లేదా నిధులను మీ జారీ చేసిన బ్యాంక్ మాత్రమే ఉంచుతుంది, నిర్వహిస్తుంది;
  4. UPI Lite ఖాతాను డెబిట్ లావాదేవీలకు మాత్రమే ఉపయోగించవచ్చు, అన్ని క్రెడిట్ లావాదేవీలు (రీఫండ్‌లు మొదలైనవి) మీ బ్యాంక్ ఖాతాలో ప్రాసెస్ చేయబడతాయి.
  5. UPI Lite ఖాతాను పీర్-టు-పీర్ కలెక్ట్ రిక్వెస్ట్‌లకు, ఆటో పేమెంట్‌కు, అంతర్జాతీయ పేమెంట్ లావాదేవీలకు ఉపయోగించరాదు.
  6. 500 రూపాయల వరకు (రూ 4000 మొత్తం రోజువారీ వినియోగ పరిమితికి లోబడి) ఏదైనా పేమెంట్ లావాదేవీ కోసం, మీ UPI Lite ఖాతాలో తగినంత నిధులు అందుబాటులో ఉంటే, మీ UPI Lite ఖాతా ఆటోమేటిక్ సెట్టింగ్‌గా ఉపయోగించబడుతుంది.

డీ-రిజిస్ట్రేషన్: మీరు Google Pay యాప్ నుండి ఎప్పుడైనా UPI Lite సర్వీసులను డిజేబుల్ చేయవచ్చు. డిజేబుల్ చేయబడిన తర్వాత, ఉపయోగించబడని UPI Lite బ్యాలెన్స్ మీ జారీ చేసిన బ్యాంక్ ద్వారా మీ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ చేయబడుతుంది. మీకు కింది విషయాలు అర్థం అయ్యాయి:

  1. మీ బ్యాంక్ ఖాతా మూసివేయబడితే, మూసివేతకు ముందు మీ UPI Lite ఖాతాలో ఒకవేళ బ్యాలెన్స్ ఉన్నట్లయితే ఆ అమౌంట్‌ను మీరు ఖర్చు చేయగలరు.
  2. మీరు మీ మొబైల్ డివైజ్‌ను మార్చినట్లయితే లేదా మీ మొబైల్ డివైజ్‌ పోయినట్లతే, UPI Lite ఖాతా తాలూకు అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌ను మీ కొత్త డివైజ్‌లో తిరిగి పొందటానికి అర్హత ఉండదు, ఎందుకంటే కొత్త డివైజ్‌ కోసం కొత్త UPI Lite ఖాతా క్రియేట్ చేయబడుతుంది. మీరు మీ మొబైల్ డివైజ్‌ను మారుస్తుంటే, మీరు మీ పాత డివైజ్‌ నుండి మీ UPI Lite ఖాతాను డిజేబుల్ చేశారని, UPI Lite బ్యాలెన్స్‌ను మీ బ్యాంక్ ఖాతాకు తిరిగి తరలించారని నిర్ధారించుకోవాలి. మీరు మీ పాత ఫోన్/డివైజ్‌ నుండి UPI LITEను డిజేబుల్ చేయడంలో విఫలమైతే, మీ జారీ చేసిన బ్యాంక్ అందుబాటులో ఉన్న UPI LITE బ్యాలెన్స్‌ను మీ ఖాతాకు తిరిగి తరలించలేదు. అయితే, మీరు దాని గురించి జారీ చేసిన బ్యాంక్‌కు తెలియజేస్తే, మీ జారీ చేసిన బ్యాంక్ అందుబాటులో ఉన్న ఏదైనా UPI LITE బ్యాలెన్స్‌ను మీ ఖాతాకు రీఫండ్ చేయడానికి ఉత్తమ ప్రయత్న ప్రాతిపదికన ప్రయత్నిస్తుంది. పేర్కొన్న సందర్భాలలో ఏదైనా సంభవించడం వల్ల మీ UPI Lite ఖాతాలో డబ్బు నష్టానికి Google, NPCI లేదా మీ జారీ చేసిన బ్యాంక్ బాధ్యులు కాదని మీరు అర్థం చేసుకున్నారు.

ఛార్జ్‌బ్యాక్: UPI Lite లావాదేవీ కింద ఏదైనా రీఫండ్ లేదా ఛార్జ్‌బ్యాక్ రిక్వెస్ట్‌లు ఈ Google Pay నియమాలలో రీఫండ్‌లు, ఛార్జ్‌బ్యాక్ విభాగంలో సూచించిన అదే ప్రక్రియను అనుసరిస్తాయి.

UPI Lite ఖాతా సెక్యూరిటీ:

  1. మీ Google Pay యాప్‌తో పాటు, UPI Lite లావాదేవీలతో అనుబంధించబడిన ఇతర వివరాల గోప్యతను కాపాడటానికి మీరు బాధ్యులు, UPI Lite ఎనేబుల్ చేయబడిన మీ మొబైల్ ఫోన్(ల)లో జరిగే అన్ని యాక్టివిటీలకు పూర్తిగా మీరే బాధ్యత వహించాలి.
  2. UPI Liteను ఉపయోగించి మీ Google Pay ఖాతా నుండి అనధికారిక లావాదేవీలేవైనా జరిగితే వాటికి మీరు NPCI/Googleను బాధ్యులు చేయరు.
  3. మీరు మీ UPI Lite ఖాతాను Google Pay యాప్‌లో కాపాడడంలో ఏ విధంగానైనా విఫలం కావడం వల్ల లేదా UPI Lite నియమాలను పాటించకపోవడం వల్ల, మీకు గానీ లేదా మరెవరికైనా గానీ కలిగే నష్టానికి లేదా హానికి NPCI/Google బాధ్యులు కాదు.

ఇక్కడ ఉన్న UPI Lite నియమాలలో ఏదైనా భిన్నంగా ఉన్నప్పటికీ, ఏ సమయంలోనైనా, తన స్వంత విచక్షణ మేరకు మీకు లేదా మరే ఇతర వ్యక్తికి ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా లేదా బాధ్యత వహించకుండా మీకు UPI Liteను ఎనేబుల్ చేయడాన్ని నిరాకరించడానికి, Google Pay యాప్‌లో మీ యూజర్ ఖాతాకు యాక్సెస్‌ను నిలిపివేయడానికి లేదా ఖాతాను రద్దు చేయడానికి NPCI/Google హక్కును కలిగి ఉంది.

14. UPI ద్వారా RuPay క్రెడిట్ కార్డ్

మీరు Google Payలో మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను లింక్ చేసిన విధంగానే వ్యాపారులకు పేమెంట్‌లను చేయడానికి ప్రత్యామ్నాయ పద్ధతిగా Google Payలో మీ RuPay క్రెడిట్ కార్డ్‌ను లింక్ చేయవచ్చు. మీ RuPay క్రెడిట్ కార్డ్‌ను లింక్ చేయడానికి, మీరు పేమెంట్ ఆప్షన్‌ల పేజీలో RuPay క్రెడిట్ కార్డ్‌ను, మీకు ఇప్పటికే క్రెడిట్ ఖాతా ఉన్న సంబంధిత బ్యాంక్‌ను ఎంచుకున్నప్పుడు, UPI PIN (MPIN)ను క్రియేట్ చేయడానికి జారీ చేసిన బ్యాంకుతో, మీ RuPay క్రెడిట్ కార్డ్ చివరి 6 అంకెలను చెల్లుబాటు వివరాలతో (MMYY ఫార్మాట్‌లో) మీరు వెరిఫై చేయవలసి ఉంటుంది. వ్యాపారులకు చెల్లించడానికి Google Pay యాప్‌లో పేమెంట్ ఆప్షన్‌గా మీరు మీ క్రెడిట్ ఖాతాను ఎంచుకున్న ప్రతిసారీ లావాదేవీలను ప్రామాణీకరించడానికి MPIN ఉపయోగించబడుతుంది. మీరు Google Payలో మీ RuPay క్రెడిట్ కార్డ్‌ను లింక్ చేసిన తర్వాత, UPI QR కోడ్‌లను స్కాన్ చేసి, మీ MPINను ఉపయోగించి లావాదేవీలను ప్రామాణీకరించడం ద్వారా వ్యాపారులకు పేమెంట్‌లను చేయడానికి మీరు పేర్కొన్న క్రెడిట్ కార్డ్‌ను ఎంచుకోవచ్చు. స్పష్టంగా, ఈ ఫంక్షనాలిటీ UPIలో RuPay క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్‌లను అంగీకరించే వ్యాపారులకు మాత్రమే పరిమితం. వ్యాపారుల వద్ద క్యాష్ విత్‌డ్రా, పీర్-టు-పీర్ పేమెంట్‌లు, P2PM, కార్డ్ టు కార్డ్ పేమెంట్‌లు ఈ ఫంక్షనాలిటీ ద్వారా అనుమతించబడవు.

లావాదేవీ పరిమితి. ఈ ప్రాసెస్ ద్వారా లావాదేవీలు UPI స్టాండర్డ్ లావాదేవీ పరిమితులను ఫాలో చేస్తాయి, వర్తించే చట్టం ప్రకారం ఎప్పటికప్పుడు ఇవి మారవచ్చు.

వివాదాలు. RuPay క్రెడిట్ ఖాతాను ఉపయోగించి పేమెంట్ లావాదేవీల నుండి ఉత్పన్నమయ్యే అన్ని రిక్వెస్ట్‌లు కింద ఉన్న ఈ నియమాలలో వివాదం విభాగంలో పేర్కొన్న అదే ప్రాసెస్‌ను ఫాలో చేస్తాయి.

15. UPI సర్కిల్

మీరు Google Payలో UPI సర్కిల్ (దిగువ నిర్వచించబడిన) ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. UPI సర్కిల్‌ను యాక్సెస్ చేయడానికి లేదా ఉపయోగించడానికి ముందు UPI సర్కిల్ నియమాలను జాగ్రత్తగా చదవండి. సందర్భం వేరే విధంగా సూచించకపోతే, కింది పదాలకు దిగువ సెట్ చేసిన అర్థాలే ఉంటాయి.

"UPI సర్కిల్" అంటే ఒక ప్రధాన యూజర్ సెకండరీ యూజర్‌ను అతని/ఆమె UPI IDని సదరు ప్రధాన యూజర్ తాలూకు UPI IDతో లింక్ చేయడానికి, సంపూర్ణ నియుక్త బృందం లేదా పాక్షిక నియుక్త బృందం ప్రాతిపదికన UPI పేమెంట్‌లు/లావాదేవీలు చేయడానికి అధికారం ఇచ్చే ఫీచర్. సంపూర్ణ నియుక్త బృందం విషయంలో, ప్రధాన యూజర్ సదరు పేమెంట్‌లు/లావాదేవీలు చేయడానికి సెకండరీ యూజర్‌కు గరిష్ఠ పరిమితిని కేటాయించవచ్చు (అంటే పైన పేర్కొన్న UPI పేమెంట్‌లు/లావాదేవీలు చేయడానికి ప్రధాన యూజర్ పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా నుండి ఉపయోగించబడే నిధుల గరిష్ఠ అమౌంట్).

"సంపూర్ణ నియుక్త బృందం" అంటే నిర్వచించబడిన గరిష్ఠ ఖర్చు పరిమితుల ప్రకారం సెకండరీ యూజర్‌ను UPI సర్కిల్ లావాదేవీలను ప్రారంభించడానికి, పూర్తి చేయడానికి ప్రధాన యూజర్ అధికారం ఇవ్వగల పద్ధతి/విధానం.

"పాక్షిక నియుక్త బృందం" అంటే ప్రధాన యూజర్ తన/ఆమె UPI PINను ఎంటర్ చేయడం ద్వారా పేర్కొన్న లావాదేవీని ప్రామాణీకరించడానికి లోబడి, సెకండరీ యూజర్ UPI సర్కిల్ ఆధారిత లావాదేవీని ప్రారంభించడానికి, పూర్తి చేయడానికి వారికి ప్రధాన యూజర్ అధికారం ఇవ్వగల పద్ధతి/విధానం.

"ప్రధాన యూజర్" అంటే UPI ఆధారిత సర్వీసులు/సౌకర్యాలను పొందడం కోసం Google Pay యాప్‌ను ఉపయోగించడంతో పాటు Google Pay యాప్‌లో అందుబాటులో ఉన్న UPI తాలూకు UPI సర్కిల్ ఫీచర్‌ను ఉపయోగించి సెకండరీ యూజర్‌కు పేమెంట్‌లను డెలిగేట్ చేస్తున్న వ్యక్తి.

"సెకండరీ యూజర్" అంటే UPIకి లింక్ చేయబడిన ప్రధాన యూజర్ బ్యాంక్ ఖాతా నుండి UPI సర్కిల్ లావాదేవీలను చేయడానికి ప్రధాన యూజర్ ద్వారా అధికారం పొందిన UPI యూజర్ అని అర్థం.

మీరు వీటిని అర్థం చేసుకున్నారు, అంగీకరించారు, ధృవీకరించారు, కట్టుబడి ఉన్నారు:

  1. ప్రధాన యూజర్ కోసం:
    • UPI సర్కిల్‌లో సెకండరీ యూజర్ UPI లావాదేవీలు జరపడానికి మీరు అతని / ఆమె తాలూకు UPI IDని, మొబైల్ నంబర్‌ను మీ UPI IDతో లింక్ చేయడం కోసం మీరు అతనికి / ఆమెకు అధికారం ఇవ్వడానికి ముందు వెరిఫై చేయడానికి, వాలిడేట్ చేయడానికి, అలాగే సెకండరీ యూజర్‌గా సరైన వ్యక్తి ప్రామాణీకరించబడ్డారని నిర్ధారించుకోవడానికి మీదే పూర్తి బాధ్యత.
    • మీరు UPI సర్కిల్ కోసం సెకండరీ యూజర్‌కు మంజూరు చేసిన ప్రామాణీకరణను సవరించవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు.
    • UPI సర్కిల్‌లో సెకండరీ యూజర్ ద్వారా జరిగిన అన్ని లావాదేవీలకు మీకు యాక్సెస్, విజిబిలిటీ ఉంటుంది.
    • సెకండరీ యూజర్ తాలూకు ఐడెంటిటీ గురించి మీకు తెలుసునని, UPI సర్కిల్‌ను ఉపయోగించే సమయంలో, వర్తించే భారతదేశ చట్టాలకు లోబడి ఉంటారని మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
    • UPI సర్కిల్‌లో మీరు చేర్చిన/ప్రామాణీకరించిన సెకండరీ యూజర్ ద్వారా నిర్వహించబడిన అన్ని లావాదేవీలు, చర్యలకు మీరు పూర్తిగా బాధ్యులు అవుతారు. UPI సర్కిల్‌ను ఉపయోగించి మీ సెకండరీ యూజర్ ఏవైనా అనధికారిక లావాదేవీలు చేస్తే వాటికి మీరు NPCIని గానీ, Google Payని గానీ బాధ్యులు చేయరు. UPI సర్కిల్‌కు వర్తించే ఏవైనా నియమాలకు, షరతులకు అనుగుణంగా ఉండటంలో మీరు లేదా మీ సెకండరీ యూజర్ చేసిన ఏదైనా చర్య లేదా లోపం ఫలితంగా ఉత్పన్నమయ్యే ఏవైనా నష్టాలకు, ప్రమాదాలకు, బాధ్యతలకు సంబంధించి మీరు లేదా మరే ఇతర వ్యక్తి NPCIని లేదా Google Payని బాధ్యులుగా చేయకూడదు.
    • Google Pay యాప్ ద్వారా UPI సర్కిల్‌ను ఉపయోగించి ఎప్పటికప్పుడు సూచించబడే వ్యవధి వరకు లావాదేవీలు జరగకపోతే, సంబంధిత సెకండరీ యూజర్ తాలూకు UPI సర్కిల్ లావాదేవీలను నిర్వహించడానికి గల అధికారం సస్పెండ్ కావచ్చు లేదా రద్దు కావచ్చు.
  2. సెకండరీ యూజర్ కోసం:
    • UPI సర్కిల్ కింద మీ UPI IDని ప్రధాన యూజర్ తాలూకు UPI IDకి లింక్ చేయడానికి రిక్వెస్ట్‌ను అంగీకరించడం ద్వారా, మీరు మీ పేరు, ఫోన్ నంబర్, UPI ID, లావాదేవీ వివరాలను ప్రధాన యూజర్‌తో, UPI సర్కిల్ లావాదేవీల ప్రాసెసింగ్‌లో పాల్గొనే ఇతర థర్డ్-పార్టీలతో షేర్ చేసుకోవడానికి దీని ద్వారా అంగీకరిస్తున్నారు.
    • మీరు ఎప్పుడైనా మీ UPI IDని ప్రధాన యూజర్‌తో డీ-లింక్ చేయవచ్చు.
  3. ఇతర నియమాలు:
    • సంపూర్ణ నియుక్త బృందంలో UPI సర్కిల్ ద్వారా లావాదేవీలు చేయడానికి ఏ సమయంలోనైనా గరిష్ఠంగా నెలకు ₹15000 పరిమితి అనుమతించబడుతుంది.
    • సంపూర్ణ నియుక్త బృందంలో UPI సర్కిల్ ద్వారా లావాదేవీలు చేయడానికి ఏ సమయంలోనైనా లావాదేవీకి గరిష్ఠంగా ₹5000 పరిమితి అనుమతించబడుతుంది.
    • సంపూర్ణ నియుక్త బృందంలో, సెకండరీ యూజర్ తాలూకు UPI IDని ప్రధాన యూజర్ తాలూకు UPI IDతో గరిష్ఠంగా 5 సంవత్సరాల కాలానికి, కనిష్ఠంగా 1 నెల కాలానికి లింక్ చేయవచ్చు.
    • సెకండరీ యూజర్ తాలూకు UPI IDని ప్రధాన యూజర్‌తో ప్రామాణీకరణ, లింక్ చేయడం విజయవంతం అయిన తర్వాత, 30 నిమిషాల కూలింగ్ పీరియడ్ ఉంటుంది, ఈ సమయంలో ఎటువంటి లావాదేవీని ప్రారంభించడానికి అనుమతి ఉండదు.
    • UPI సర్కిల్ నియమాలలో ఏదైనా భిన్నంగా ఉన్నప్పటికీ, Google Pay తన స్వంత విచక్షణ మేరకు, మీకు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా UPI సర్కిల్ సర్వీసులకు మీ యాక్సెస్‌ను సస్పెండ్ చేయడానికి లేదా రద్దు చేయడానికి లేదా మీ యాప్ పాస్‌వర్డ్‌ను లేదా UPI PINను మార్చమని మిమ్మల్ని అడగడానికి హక్కును కలిగి ఉంది.

16. గోల్డ్ ఖాతా

గోల్డ్‌ను ఉంచుకోవడం లేదా కొనుగోలు చేయడం మీద పరిమితులు. మీ GAP ఖాతాలో ఉంచబడే గోల్డ్ పరిమాణంపై గానీ లేదా మీ GAP ఖాతాలో గోల్డ్‌ను సేకరించడానికి మీరు GPayలో లావాదేవీ చేసే అమౌంట్‌పై గానీ Google పరిమితులను విధించవచ్చు.

GAP ఖాతాలను నిలిపివేయడం, రద్దు చేయడం. మీరు సమర్పించిన KYC వివరాలు తప్పుగా ఉండటం, మోసం, ఈ సంయుక్త Google Pay నియమాలు లేదా మేము ఎప్పటికప్పుడు రూపొందించే ఇతర పాలసీల ఉల్లంఘనతో సహా ఏ కారణం చేతనైనా Google, మా స్వంత విచక్షణ మేరకు, మీకు లేదా ఏదైనా థర్డ్-పార్టీకి ఎటువంటి నోటీసు లేకుండా, బాధ్యత వహించకుండా (ఎ) మీ గోల్డ్ ఖాతాకు యాక్సెస్‌ను నిలిపివేయడానికి; లేదా (బి) MMTCని మీ GAP ఖాతాను రద్దు చేయమని అభ్యర్థించడానికి, హక్కు కలిగి ఉంది. అలాంటి సందర్భంలో, Google తన విచక్షణతో, మీ బ్యాంక్ ఖాతాను క్రెడిట్ చేయడం, MMTC మీ గోల్డ్‌ను తిరిగి కొనుగోలు చేయడం సహా, అవసరమని భావించే ఏదైనా చర్య తీసుకోవచ్చు.

హోస్టింగ్ సమాచారం. సాధారణ సమాచార ప్రయోజనాల కోసం గోల్డ్‌కు సంబంధించిన సమాచారాన్ని, MMTC ఎప్పటికప్పుడు అందించి, అప్‌డేట్ చేసిన పద్ధతిలో Google, Google Payలో డిస్‌ప్లే చేస్తుంది. MMTC అందించే సదరు సమాచారం తాలూకు ఖచ్చితత్వానికి Google బాధ్యులు కాదు, అది బాధ్యత వహించదు.

పేమెంట్ లావాదేవీ. గోల్డ్ ఖాతాలో ప్రారంభించబడిన అన్ని పేమెంట్ లావాదేవీలు సంయుక్త Google Pay నియమాలకు లోబడి ఉంటాయి. స్పష్టంగా తెలియజేయుట ఏమనగా, Google Payలో మీ Google ఖాతాతో GAP తాలూకు టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌ను Google అందిస్తుంది. అయితే, అన్ని గోల్డ్ లావాదేవీలు మీకు, MMTC మధ్య మాత్రమే నిర్వహించబడతాయి. ఏదైనా గోల్డ్ లావాదేవీ నుండి ఉత్పన్నమయ్యే లేదా దానికి సంబంధించిన ఏవైనా నష్టాలకు Google బాధ్యత వహించదు, బాధ్యులు కాదు.

సమాచారం స్టోరేజ్. Google Payలో గోల్డ్ ఖాతాను తెరవడం ద్వారా, Google Payలో మీకు సర్వీసులను అందించే ఉద్దేశ్యంతో, మీ గోల్డ్ లావాదేవీ సమాచారాన్ని, మీ గోల్డ్ ఖాతాకు సంబంధించిన ఇతర సమాచారాన్ని నిరంతరం యాక్సెస్ చేయడానికి, ఉపయోగించడానికి, స్టోర్ చేయడానికి మీరు Google Payకి స్పష్టంగా అధికారం ఇస్తున్నారు.

17. కమ్యూనికేషన్ సర్వీసులు

Google Pay ద్వారా మీరు మెసేజ్‌లను పంపగలరు. మీరు ఇతర సర్వీస్ ప్రొవైడర్‌లు, యూజర్‌లు, వ్యాపారులు లేదా బిల్లర్‌లతో Google Pay ద్వారా చేసే ఏదైనా కమ్యూనికేషన్‌కు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీరు, ఇతర సర్వీస్ ప్రొవైడర్‌లు, యూజర్‌లు, వ్యాపారులు లేదా బిల్లర్‌లు ఒకరితో ఒకరు సంభాషించుకోవడానికి Google కేవలం ఒక ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది (కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్), పార్టీల మధ్య జరిగే ఏ సంభాషణకూ అది బాధ్యత వహించదు. Google Pay ద్వారా ఎటువంటి చట్టవిరుద్ధమైన, చట్టవ్యతిరేకమైన లేదా అనధికార కమ్యూనికేషన్ జరగడం లేదని తప్పనిసరిగా మీరు నిర్ధారించుకోవాలి. కమ్యూనికేషన్ తాలూకు కంటెంట్ తప్పనిసరిగా ఈ సంయుక్త Google Pay నియమాలకు, ప్రత్యేకించి, Google Pay పాలసీలకు అనుగుణంగా ఉండాలి. మీరు కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇతర యూజర్‌లకు నేరుగా ఎలాంటి ఆఫర్‌లు గానీ, ప్రమోషన్‌లు గానీ లేదా అడ్వర్టయిజ్‌మెంట్‌లు గానీ చేయకూడదని అంగీకరిస్తున్నారు. Google Pay పాలసీలకు లేదా ఈ సంయుక్త Google Pay నియమాలకు అనుగుణంగా లేని ఏదైనా కమ్యూనికేషన్ జరిగిన సందర్భంలో, మీ Google Pay సర్వీసుల వినియోగాన్ని పూర్తిగా లేదా కొంత భాగాన్ని సస్పెండ్ చేయడానికి లేదా రద్దు చేయడానికి Google హక్కును కలిగి ఉంది. సెక్షన్ 21లో పేర్కొన్న ప్రయోజనాల కోసం, ఆటోమేటెడ్ మార్గాల ద్వారా, మీ Google Pay కమ్యూనికేషన్‌లను కలెక్ట్ చేయడానికి, స్టోర్ చేయడానికి, ఉపయోగించడానికి, యాక్సెస్ చేయడానికి Google హక్కును కలిగి ఉంది.

18. ఆఫర్‌లు

Google Pay ఆఫర్‌లు. Google Pay ఆఫర్‌లలో మీ భాగస్వామ్యం అనేది సాధారణ Google Pay ఆఫర్‌ల నియమాలకు లోబడి ఉంటుంది. Google Payలో రన్ అయ్యే రెఫరల్ ఆఫర్‌లు లేదా బోనస్ అన్వేషణల కోసం, రెఫరర్, రెఫరీ ఇద్దరూ Google ద్వారా తెలియజేయబడిన రివార్డులకు అర్హులు అవుతారు. రెఫరర్‌లు తమ రెఫరీలు అర్హతగల లావాదేవీలను పూర్తి చేసిన ఆధారంగా Google ద్వారా తెలియజేయబడిన రివార్డులను పొందుతారు. మీరు ఇప్పటికే ఉన్న Google Pay యూజర్/రెఫరర్ ద్వారా రెఫర్ చేయబడి, Google Payని ఉపయోగించడం ద్వారా రెఫరల్ ఆఫర్/బోనస్ అన్వేషణలలో పాల్గొనాలని ఎంచుకుంటే, రెఫరల్ ఆఫర్/బోనస్ అన్వేషణ తాలూకు అర్హతగల లావాదేవీలు పూర్తి కావడాన్ని, వాటి ప్రోగ్రెస్ స్టేటస్‌ను రెఫరర్‌తో షేర్ చేస్తారని మీరు అర్థం చేసుకున్నారు, తద్వారా రివార్డు పొందే దిశగా ప్రోగ్రెస్‌ను పారదర్శకంగా ఉంచడానికి రెఫరర్‌తో షేర్ చేసుకోవచ్చు. +91 దేశం కోడ్‌తో ప్రారంభమయ్యే భారతీయ మొబైల్ నంబర్‌లు ఉన్న యూజర్‌లకు మాత్రమే రెఫరల్ ఆఫర్‌లు చెల్లుబాటు అవుతాయని మీరు మరింత అర్థం చేసుకున్నారు.

వ్యాపారి/బిల్లర్ ఆఫర్‌లు. Google Payలో వ్యాపారులు లేదా బిల్లర్‌లు మీకు అందించే ఆఫర్‌లు మీకు, వ్యాపారికి లేదా బిల్లర్‌కు మధ్య ఉంటాయి. సదరు ఆఫర్‌ల కంటెంట్‌కు లేదా ఆఫర్‌ల ఫుల్‌ఫిల్‌మెంట్‌కు Google బాధ్యత వహించదు.

19. రీఫండ్‌లు, ఛార్జ్‌బ్యాక్‌లు, వివాదాలు

రీఫండ్‌లు, ఛార్జ్‌బ్యాక్‌లు. ఈ సంయుక్త Google Pay నియమాలలో పేర్కొన్న వాటిని మినహాయించి, Google Pay సర్వీసుల ద్వారా ప్రాసెస్ చేయబడిన లావాదేవీలు ఏవైనా Google Pay ద్వారా పంపినవారికి రీఫండ్ చేయబడవు, అలాగే Google Pay సర్వీసుల ద్వారా పంపినవారు రివర్స్ చేయలేరు. మీ పేమెంట్ ఆప్షన్ జారీ చేసే సంస్థ ఒప్పందం ప్రకారం లేదా వర్తించే నిబంధనల ప్రకారం మీకు అదనపు రీఫండ్ లేదా ఛార్జ్‌బ్యాక్ హక్కులు ఉండవచ్చు. మీ పేమెంట్ ఆప్షన్ జారీ చేసే సంస్థ నుండి మీరు అందుకున్న స్టేట్‌మెంట్‌లను రివ్యూ చేయాలి, అవి Google Pay సర్వీసుల ద్వారా అన్ని లావాదేవీలను ప్రతిబింబించాలి.

పంపినవారి తాలూకు పేమెంట్ ఆప్షన్‌ను జారీ చేసే సంస్థ, లావాదేవీకి ఛార్జ్‌బ్యాక్‌ను రిక్వెస్ట్ చేసిన సందర్భంలో, లావాదేవీ అమౌంట్‌ను రివర్స్ చేసే హక్కు Googleకు ఉంటుంది. అనంతరం గ్రహీతకు బదిలీ చేయబడే పేమెంట్‌ల నుండి ఏదైనా ఛార్జ్‌బ్యాక్ అమౌంట్‌ను సెట్-ఆఫ్ చేసే హక్కును Google కలిగి ఉంది.

వివాదాలు. పంపినవారికి, గ్రహీతకు మధ్య మాత్రమే పేమెంట్ లావాదేవీ జరుగుతుందని, ఏదైనా యూజర్, బిల్లర్, వ్యాపారి, థర్డ్-పార్టీ లేదా అటువంటి యూజర్, బిల్లర్, వ్యాపారి లేదా థర్డ్-పార్టీ అందించే ఏదైనా సర్వీసు, వస్తువు లేదా డెలివరీ స్థాయి నిబద్ధతకు సంబంధించి Google ఎటువంటి హామీలను లేదా వారంటీలను అందించదని మీరు అర్థం చేసుకున్నారు. ఏ విధంగానూ Google Pay సర్వీసులను ఉపయోగించడం అంటే ఏదైనా యూజర్, బిల్లర్, వ్యాపారి లేదా థర్డ్-పార్టీ తాలూకు Google ద్వారా ఎండార్స్‌మెంట్ కాదు. Google Pay సర్వీసులను ఉపయోగించి ఎవరికైనా పేమెంట్‌లు బదిలీ చేసే ముందు మీరు తగిన శ్రద్ధ పెట్టారని నిర్ధారించుకోవాలి. ఏదైనా వివాదం పంపినవారికి, గ్రహీతకు మధ్య ఉంటుంది తప్ప Google మరియు/లేదా పేమెంట్‌ల సిస్టమ్ ప్రొవైడర్‌లు సదరు వివాదాలలో పార్టీగా ఉండదు. అయితే, UPI పేమెంట్ లావాదేవీలకు సంబంధించి, యూజర్‌లకు సమస్యలు / ఫిర్యాదుల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి మేము బాధ్యత వహిస్తాము. యూజర్‌లకు UPI పేమెంట్ లావాదేవీలకు సంబంధించిన అన్ని సమస్యలకు/ఫిర్యాదులకు మేము కాంటాక్ట్ చేయాల్సిన మొదటి వ్యక్తిగా ఉంటాము. సమస్య లేదా ఫిర్యాదు ఒకవేళ పరిష్కరించబడకపోతే, పై స్థాయికి రిపోర్ట్ చేయడం కోసం PSP, తర్వాత కస్టమర్ తాలూకు బ్యాంక్, చివరగా NPCIని సంప్రదించాలి. ఈ ఆప్షన్‌ల ద్వారా సమస్య ప‌రిష్కారం కాకపోతే మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్‌ను, లేదా డిజిట‌ల్ కంప్లయింట్స్ అంబుడ్స్‌మ‌న్‌ను సంప్రదించవచ్చు.

అదనంగా, మీరు Google Pay ద్వారా క్రియేట్ చేయబడిన మీ BHIM UPI లేదా క్రెడిట్ కార్డ్ ఆధారాలను ఉపయోగించి ప్రాసెసింగ్ ఉద్దేశం మరియు/లేదా నిధుల సెటిల్‌మెంట్ కోసం Google Pay సర్వీసులను ఉపయోగించని వ్యాపారి లేదా థర్డ్-పార్టీకి పేమెంట్‌లు పంపాలని ఎంచుకుంటే, Google పాత్ర పేమెంట్‌ల సిస్టమ్ ప్రొవైడర్‌కు పేమెంట్ సూచనలను అందించడానికి పరిమితం చేయబడుతుంది. Google లావాదేవీ ప్రాసెసింగ్ లేదా సెటిల్‌మెంట్‌కు లేదా ఏదైనా డెలివరీ లేదా సర్వీసు ఫుల్‌ఫిల్‌మెంట్‌కు బాధ్యత వహించదు, అయితే, కొన్ని పరిస్థితులలో, Google గ్రహీత తరఫున నిధులను స్వీకరించే పరిమిత ప్రయోజనం కోసం పేమెంట్ కలెక్షన్ ఏజెంట్‌గా వ్యవహరించవచ్చు. మీరు సరైన సమాచారాన్ని అందించారని లేదా మీరు సరైన గ్రహీతను ఎంచుకున్నారని నిర్ధారించుకోవడం మీ బాధ్యత.

పంపేవారికి, అందుకునేవారికి మధ్య గానీ లేదా పంపేవారు/అందుకునేవారు, పేమెంట్ పార్టిసిపెంట్‌ల మధ్య గానీ వివాదాలకు మధ్యవర్తిత్వం చేయడం అనేది Googleకు అనివార్యం కాదు. అయితే, వర్తించే చట్టాలు లేదా పేమెంట్ పార్టిసిపెంట్‌ల నియమాల ప్రకారం అవసరమైతే, వివాదానికి సంబంధించి ఒకరితో ఒకరు సంభాషించుకోవడంలో లేదా సంబంధిత పేమెంట్ పార్టిసిపెంట్‌కు యూజర్ ఫిర్యాదును పంపడంలో Google యూజర్‌లకు సహాయం చేస్తుంది. Google Pay సర్వీసులకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే, దయచేసి Googleను సంప్రదించండి, వీలైన చోట దాన్ని పరిష్కరించడానికి మేము మీతో కలిసి పని చేస్తాము.

పరిత్యాగం, రిలీజ్. వివాదం నుండి ఉత్పన్నమయ్యే లేదా ఏ విధంగానైనా సంబంధించిన అన్ని దావాలు, డిమాండ్‌లు, నష్టాల (వాస్తవమైనవి, పరిణామపరమైనవి) నుండి Google, గ్రూప్ కంపెనీలు, వారి ఏజెంట్లు, కాంట్రాక్టర్లు, అధికారులు, ఉద్యోగులను రిలీజ్ చేయడానికి మీరు అంగీకరిస్తున్నారు. Google Pay సర్వీసుకు సంబంధించి గ్రహీత, పంపినవారు, అడ్వర్టయిజర్ లేదా ఇతర థర్డ్-పార్టీ ఎవరితో అయినా లావాదేవీ, ఒప్పందం లేదా ఏర్పాటు నుండి ఉత్పన్నమయ్యే లేదా సంబంధించిన ఏదైనా దావాలో లేదా ఇతర వివాదంలో మీరు Googleను భాగం చేయబోమని మీరు అంగీకరిస్తున్నారు. మీరు అలా చేయడానికి ప్రయత్నిస్తే, (i) మీరు Google, గ్రూప్ కంపెనీల తాలూకు అన్ని ఖర్చులు, న్యాయవాదుల ఫీజు చెల్లించాలి, కింద పేర్కొన్న విధంగా నష్టపరిహారాన్ని అందించాలి, (ii) సదరు దావాకు లేదా వివాదానికి సంబంధించిన అధికారిక ప్రదేశం కింద పేర్కొన్న విధంగా పరిమితం చేయబడుతుంది. అయితే, ఈ సంయుక్త Google Pay నియమాలలో ఏదీ సంబంధిత పేమెంట్ పార్టిసిపెంట్‌ల నియమాలు లేదా వర్తించే చట్టాల ప్రకారం పేమెంట్ లావాదేవీకి సంబంధించి మీకు ఉండే ఏవైనా హక్కులు, క్లెయిమ్‌లు లేదా డిఫెన్స్‌ల పరిత్యాగాన్ని రూపొందించదు.

20. మోసం లేదా అనధికార వినియోగం

Google Payలో మీ Google ఖాతా ద్వారా చేసిన అన్ని లావాదేవీలు లేదా అందించబడిన సూచనలు మీరు అందించినట్లుగా పరిగణించబడతాయి. Google Payలో మీ Google ఖాతా ద్వారా మీ వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారం తాలూకు అనధికారిక యాక్సెస్ లేదా వినియోగం కోసం మీరు పూర్తిగా బాధ్యత వహిస్తారు. Google Payలో మీ Google ఖాతా తాలూకు అనధికారిక వినియోగాన్ని నిరోధించడంలో సహాయపడటానికి, మీరు Google సిఫార్సు చేసిన భద్రతా చర్యలను పాటించాలి. Google Payలో మీ Google ఖాతా యాక్సెస్ చేయబడిందని లేదా అనధికారిక పద్ధతిలో ఉపయోగించబడిందని మీరు విశ్వసిస్తే, దయచేసి వెంటనే కస్టమర్ సర్వీసును సంప్రదించండి.

21. రిస్క్ పర్యవేక్షణ: అసాధారణమైన లేదా అనుమానాస్పదమైన లావాదేవీలు

మేము అధిక-ప్రమాదకర పద్ధతులు లేదా మోసపూరిత లావాదేవీలేవీ జరగకుండా ఉండడానికి మీ లావాదేవీలను పర్యవేక్షించవచ్చు. ఈ ప్రయత్నాలలో, Google Pay సర్వీసుల తాలూకు ఇతర అంశాలలో సహాయం చేయడానికి మేము థర్డ్-పార్టీ ప్రొవైడర్‌లను లేదా ఇతర సర్వీస్ ప్రొవైడర్‌లను కూడా ఎంగేజ్ చేయవచ్చు. Google Payలో మీ Google ఖాతా ద్వారా అనుమానాస్పద లేదా అసాధారణమైన యాక్టివిటీ ఏదో జరుగుతోందని మేము విశ్వసించడానికి కారణం ఉంటే, మేము Google Pay సర్వీసులకు మీ యాక్సెస్‌ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేయవచ్చు.

రిస్క్ మేనేజ్‌మెంట్, మోసపూరితమైన, చట్టవిరుద్ధమైన లేదా సందేహాస్పద లావాదేవీలు, నిషేధిత వస్తువులను విక్రయించడం, దాడికి గురైన లేదా బ్లాక్‌లిస్ట్ చేయబడిన కార్డ్‌లు లేదా BHIM UPI ఖాతాలు, Google Payలోని Google ఖాతాలు, ఛార్జ్‌బ్యాక్‌లు/ఫిర్యాదుల వినియోగం, లేదా పేమెంట్ పార్టిసిపెంట్ నియమాలలో సూచించిన ఇతర కారణాలతో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా వివిధ కారణాల వల్ల మేము మరియు/లేదా పేమెంట్ పార్టిసిపెంట్‌లు లావాదేవీని మరియు/లేదా పేమెంట్‌ల సెటిల్‌మెంట్‌ను తిరస్కరించవచ్చు. లావాదేవీ తిరస్కరించబడినప్పుడు లేదా పూర్తి చేయలేనప్పుడు, మేము నిధులను పంపినవారి ఫండింగ్ ఖాతాకు తిరిగి బదిలీ గానీ, వర్తించే చట్టాలు లేదా పేమెంట్ పార్టిసిపెంట్ నియమాలకు అనుగుణంగా నిధుల నిర్వహణ గానీ చేస్తాము.

అదనంగా, చట్టబద్ధమైన లేదా ప్రభుత్వ అధికారం ద్వారా లేదా సంబంధిత పేమెంట్ పార్టిసిపెంట్ ద్వారా పేమెంట్ ఆదేశించబడే విధంగా మేము Google Payలోని Google ఖాతాపై ఏదైనా చర్య తీసుకోవచ్చు.

22. గోప్యత, కమ్యూనికేషన్‌లు

గోప్యత. సంయుక్త Google Pay నియమాలలోని ఇతర నిబంధనలతో పాటు, వర్తించే చట్టాలు, మా గోప్యతా పాలసీకి అనుగుణంగా మేము మీ వ్యక్తిగత డేటాను, Google Pay ద్వారా చేసే ఏవైనా కమ్యూనికేషన్‌లను కలెక్ట్ చేయవచ్చు, స్టోర్ చేయవచ్చు, ఉపయోగించవచ్చని మీరు అంగీకరిస్తున్నారు, ప్రత్యేకంగా సమ్మతిస్తున్నారు, మా గోప్యతా పాలసీ Google Payని ఉపయోగిస్తున్నప్పుడు మేము మీ వ్యక్తిగత డేటాను ఎలా చూస్తాము, మీ గోప్యతను ఎలా రక్షిస్తాము అనే దానిని వివరిస్తుంది. మా గోప్యతా పాలసీకి అదనంగా, దిగువ పేరా UPI లావాదేవీ డేటా, లోన్ దరఖాస్తు డేటా తాలూకు వినియోగాన్ని వివరిస్తుంది.

UPI లావాదేవీ డేటా:

ఆపరేషన్‌లు, సెటిల్‌మెంట్ పేమెంట్ ప్రాసెసింగ్, Google Pay సర్వీసులను ప్రమోట్ చేయడం కోసం అవసరమైన UPI లావాదేవీ డేటాతో సహా మీ పేమెంట్‌లకు సంబంధించిన సమాచారాన్ని వ్యాపారులు, బ్యాంకులు, థర్డ్-పార్టీ ప్రొవైడర్‌లు, సర్వీస్ ప్రొవైడర్‌లతో Google షేర్ చేయవచ్చు.

మీ UPI లావాదేవీ డేటా, Google (మరో మాటలో చెప్పాలంటే, Google India Digital Services Private Limited) కాకుండా మరే ఇతర సంస్థ ద్వారా ఏ మానిటైజేషన్ ప్రయోజనం కోసం (ఉదా. అడ్వర్టయిజ్‌మెంట్‌ల కోసం) ఉపయోగించబడదు.

మీరు గ్రహీత అయితే, మీకు పేమెంట్‌లను పంపే ఉద్దేశ్యంతో Google మీ బ్యాంక్ ఖాతా నంబర్‌తో సహా మీ సమాచారాన్ని Google Payలో స్టోర్ చేయవచ్చని మీరు అంగీకరిస్తున్నారు, ప్రత్యేకంగా సమ్మతిస్తున్నారు.

ఆటోమేటిక్ మార్గాల ద్వారా Google మీ Google Pay నావిగేషనల్, లాగ్, కరస్పాండెన్స్ సమాచారం/డేటాను యాక్సెస్ చేయవచ్చని మీరు అంగీకరిస్తున్నారు, ప్రత్యేకంగా సమ్మతిస్తున్నారు. ఈ సమాచారం/డేటా అనేది మా Google Pay సర్వీసులను ఉపయోగించే వ్యాపారులు, మార్కెట్‌లు, టెక్నాలజీ, ఆపరేటింగ్ సిస్టమ్‌లు, బ్రౌజర్‌లు, డివైజ్‌లు, లొకేషన్‌లను విశ్లేషించడంలో మాకు సహాయపడుతుంది. ఉదాహరణకు, సదరు సమాచారం, దాని విశ్లేషణ మీ అవసరాలను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, మీకు విస్తృతమైన సర్వీసులను అందించడానికి లేదా నిర్దిష్ట ఆపరేటింగ్ సిస్టమ్‌లు, మొబైల్ అప్లికేషన్ వెర్షన్‌ల కోసం అప్‌డేట్‌లను అభివృద్ధి చేయడంలో మాకు సహాయం చేస్తుంది. వ్యాపారులు లేదా బిల్లర్‌లు అందించే ఆఫర్‌లు, ఇతర ప్రోడక్ట్‌లు, ప్రోగ్రామ్‌లు లేదా సర్వీసులు, ఏవైతే మీకు ఆసక్తికరంగా ఉండవచ్చు అని మేము నమ్ముతామో వాటిని మీకు అందించడంలో కలెక్ట్ చేసిన సమాచారం మాకు సహాయపడుతుంది లేదా సాఫ్ట్‌వేర్ అనుకూలత సమస్యల విషయంలో మిమ్మల్ని హెచ్చరిస్తుంది.

ఆటోమేటిక్ మార్గాల ద్వారా Google మీ మొబైల్ డివైజ్‌/మొబైల్ నంబర్‌లో మీ మెసేజ్‌లను యాక్సెస్ చేయగలదని, Google లేదా గ్రూప్ కంపెనీల ద్వారా మీకు మెరుగైన సర్వీసులను అందించడానికి మీ మెసేజ్‌ల నుండి సమాచారాన్ని తిరిగి పొందవచ్చని/ఉపయోగించవచ్చని మీరు అంగీకరిస్తున్నారు, ప్రత్యేకంగా సమ్మతిస్తున్నారు. ఉదాహరణకు: OTP అనేది ఒకసారి ఉపయోగించగల పాస్‌వర్డ్. రెండవ దశ ప్రామాణీకరణ కోసం మీ జారీ చేసిన బ్యాంక్ దీనిని మీకు అందిస్తుంది. మీరు మీ మెసేజ్‌లను యాక్సెస్ చేయడానికి మమ్మల్ని అనుమతించినట్లయితే, మేము మీ మొబైల్ డివైజ్‌/నంబర్‌లో స్వీకరించిన మెసేజ్ నుండి మీ OTPని తిరిగి పొందవచ్చని, రెండవ దశ ప్రామాణీకరణ కోసం OTPని ఆటో-ఫిల్ చేసి, సమర్పించవచ్చని మీరు అర్థం చేసుకున్నారు.

ఏదైనా థర్డ్-పార్టీ లేదా గ్రహీతల నుండి అవసరమైన ముందస్తు సమ్మతులు, మినహాయింపులు అన్నింటిని మీరు పొందారని, ఈ పేరాలో వివరించిన చర్యలను నిర్వహించడానికి Googleను, గ్రూప్ కంపెనీలను, పేమెంట్ పార్టిసిపెంట్‌లను అనుమతించాలని సదరు థర్డ్-పార్టీకి లేదా గ్రహీతకు నోటీసును అందించారని మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు భవిష్యత్తులో Googleకి అలాంటి సమాచారాన్ని అందించడం కోసం, ముందుగానే సదరు నోటీసులను అందజేస్తారని, అవసరమైన సదరు సమ్మతులను, మినహాయింపులను పొందుతారని కూడా మీరు వారంట్ చేస్తున్నారు.

మీరు Google Pay నుండి లేదా మీ Google ఖాతా నుండి ఏదైనా సమాచారం లేదా డేటాను తొలగించడానికి లేదా పూర్తి తొలగింపునకు ఎంచుకుంటే లేదా మీరు లేదా Google మీ Google ఖాతా లేదా Google Pay సర్వీసుల వినియోగాన్ని రద్దు చేయడానికి ఎంచుకుంటే, Google గోప్యతా పాలసీ లో వివరించిన చట్టపరమైన కారణాల కోసం మేము ఇప్పటికీ అటువంటి సమాచారం/డేటా నిల్వ కొనసాగించుకోవచ్చు, ఉపయోగించవచ్చు మరియు/లేదా బహిర్గతం చేయవచ్చని మీరు అర్థం చేసుకుంటారు.

Google గోప్యతా పాలసీ  Google Payని ఉపయోగిస్తున్నప్పుడు మేము మీ వ్యక్తిగత డేటాను ఎలా పరిగణిస్తాము, మీ గోప్యతను ఎలా సంరక్షిస్తాము అనేది వివరిస్తుంది.

Google నుండి లేదా దానితో కమ్యూనికేషన్‌లు. మీరు Google నుండి లేదా Googleతో కమ్యూనికేషన్‌ల కోసం మీ సమాచారాన్ని కలెక్ట్ చేయడం, స్టోర్ చేయడం, ఉపయోగించడాన్ని అంగీకరిస్తున్నారు, ప్రత్యేకంగా సమ్మతిస్తున్నారు. ఈ కింది వాటి కోసం మేము స్వయంగా లేదా థర్డ్-పార్టీల ద్వారా, మీకు ఈమెయిల్స్, SMS పంపడం ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా మిమ్మల్ని సంప్రదించవచ్చని మీరు అంగీకరిస్తున్నారు, ప్రత్యేకంగా సమ్మతిస్తున్నారు:

(i) మీకు Google Pay సర్వీసులను అందించడం, లావాదేవీ సంబంధిత లేదా ఖాతా సంబంధిత సమాచారాన్ని అందించడం కోసం;

(ii) మీకు పేమెంట్‌కు సంబంధించిన రిమైండర్‌లను/అప్‌డేట్‌లను పంపడం కోసం;

(iii) Google Pay సర్వీసులు లేదా ఇతర Google సర్వీసులను ప్రమోట్ చేయడం కోసం;

(iv) ఈ సంస్థలు అందించే ఏవైనా ఆఫర్‌లు లేదా పథకాలు లేదా బహుమతులతో సహా గ్రూప్ కంపెనీల సర్వీసులను లేదా మా థర్డ్-పార్టీ ప్రొవైడర్‌ల సర్వీసులను ప్రమోట్ చేయడం కోసం. ఈ ప్రమోషన్‌లు మీ UPI లావాదేవీల డేటాను ఉపయోగించవు;

(v) కొత్త ప్రోడక్ట్‌లను, యాక్టివిటీలను ప్రమోట్ చేయడం;

(vi) ఫిర్యాదులతో సహా ఏదైనా ప్రోడక్ట్ లేదా Google Pay సర్వీసుకు సంబంధించిన సమస్యలను విచారించడం లేదా పరిష్కరించడం కోసం; లేదా

(vii) మీ అమూల్యమైన ఫీడ్‌బ్యాక్‌ను పొందడం.

మీకు మరింత మెరుగైన సేవ అందించే ఉద్దేశంతో, మేము కింది విషయాలు అర్థం చేసుకోవడానికి మీకు సర్వేలను కూడా పంపవచ్చు: (i) మా సర్వీసులతో మీ అనుభవం మరియు/లేదా (ii) మీ అవసరాలు, ఆవశ్యకతలు.

మీరు Google Pay సర్వీసులకు సంబంధించి, సర్వీసును గానీ, మా ప్రోడక్ట్‌లను గానీ ఎలా మెరుగుపరచాలనే వాటితో సహా, వీటికే పరిమితం కాకుండా కామెంట్‌లను లేదా ఆలోచనలను సమర్పించడానికి మీరు ఎంచుకోవచ్చు లేదా మేము మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. ఏదైనా ఐడియాను సమర్పించడం ద్వారా, మీరు దీనికి అంగీకరిస్తున్నారు: మీ డిస్‌క్లోజర్ (ఐడియాను బహిర్గత పరచడం) స్వచ్ఛందం, రిక్వెస్ట్ చేసింది కాదు, దానిపైన ఎలాంటి పరిమితులు ఉండవు. మాపై ఎలాంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరాన్ని గానీ, ఇతర ఆబ్లిగేషన్‌ను (అనివార్య కార్యాన్ని) గానీ పెట్టదు. మీకు ఎలాంటి ప్రతిఫలం చెల్లించకుండా మీ ఐడియాను మేము స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. మరియు/లేదా మీ ఐడియాను నాన్-కాన్ఫిడెన్షియల్ బేసిస్ మీద (రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేకుండా) డిస్‌క్లోజ్ చేయవచ్చు లేదా మరో వ్యక్తికి షేర్ చేయవచ్చు.

లోన్ దరఖాస్తు డేటా:

మీరు Google Payలో లోన్‌ల కోసం దరఖాస్తు చేసినప్పుడు, Google Pay కింది వ్యక్తిగత సమాచారాన్ని కలెక్ట్ చేయవచ్చు

  • వ్యక్తిగత వివరాలు: పూర్తి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఈమెయిల్, మొబైల్, PAN, వైవాహిక స్థితి, తండ్రి & తల్లి పేరు, ప్రస్తుత, శాశ్వత చిరునామా, బ్యాంక్ ఖాతా నంబర్, బ్యాంక్ IFSC నంబర్.

  • ఉపాధి & ఆదాయ వివరాలు: ఉపాధి/వృత్తి రకం, యజమాని/ కంపెనీ పేరు, పరిశ్రమ, రిజిస్ట్రేషన్ రకం, వ్యక్తిగత & కుటుంబ ఆదాయం, ఆఫీస్ అడ్రస్.

లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీలు నిర్వహించే ప్రారంభ దశ/KYC ప్రయోజనాల కోసం అవసరమైన మీ మొబైల్ ఫోన్‌లోని కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్ లేదా మరే ఇతర సౌకర్యం వంటి కొన్ని ఫీచర్‌లకు Google Pay ఒక-సారి యాక్సెస్ తీసుకోవచ్చు. Google Pay ఎటువంటి బయోమెట్రిక్ డేటానూ కలెక్ట్ చేయదు, స్టోర్ చేయదు.

Google Pay మీ వ్యక్తిగత లోన్ దరఖాస్తులో భాగంగా కలెక్ట్ చేసిన మీ వ్యక్తిగత డేటాను కింది ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది: a) మీ క్రెడిట్ సమాచారానికి సమాచారాన్ని పంపడం ద్వారా మీ లోన్ సదుపాయం సర్వీసు కోసం మీ దరఖాస్తును సులభతరం చేయడానికి, b) లోన్ సదుపాయం సర్వీసుల ఎనలిటిక్స్ ప్రయోజనాల కోసం, c) ఏవైనా ఫిర్యాదులు/దావాలు/వివాదాలను చేపట్టడానికి లేదా విచారించడానికి, d) ఎప్పటికప్పుడు ప్రోడక్ట్‌లను, సర్వీసులను పర్యవేక్షించడానికి, రివ్యూ చేయడానికి, e) ఆర్థిక/ నియంత్రణ/ మేనేజ్‌మెంట్ రిపోర్టింగ్‌ను చేపట్టడానికి, వివిధ ప్రమాద మేనేజ్‌మెంట్ మోడల్స్‌ను క్రియేట్ చేసి, నిర్వహించడానికి, f) ఆడిట్‌లను నిర్వహించడానికి, రికార్డ్ కీపింగ్ ప్రయోజనాల కోసం.

లోన్ దరఖాస్తు డేటా ఎలా షేర్ చేయబడుతుంది?

మీ లోన్ దరఖాస్తును ప్రాసెస్ చేయడం కోసం, Google Pay మీ సమ్మతిని స్పష్టంగా పొందిన తర్వాత మీ వ్యక్తిగత డేటాను లోన్‌లు మంజూరు చేసే థర్డ్-పార్టీలతో పంచుకుంటుంది. ఒకసారి షేర్ చేసిన తర్వాత, లోన్ అందించే వారి వద్ద ఉన్న ఈ డేటా, ఎవరి వద్దకు లోన్ దరఖాస్తు పంపబడిందో ఆ లోన్ అందించే వారి గోప్యతా పాలసీకి అనుగుణంగా కూడా ప్రాసెస్ చేయబడుతుంది. Google Pay మీ వ్యక్తిగత డేటాను ఏ లోన్‌లు మంజూరు చేసే పార్ట్‌నర్‌తోనూ నిరంతరంగా షేర్ చేయదు. షేర్ చేయబడే మొత్తం డేటా ఒక సారి పంపేది మాత్రమే.

డేటా & సమ్మతి తొలగింపు / వినాశనం / పూర్తి తొలగింపు / నిల్వ కొనసాగింపు

మీరు మీ UPI లావాదేవీల డేటా, లోన్ దరఖాస్తు డేటాను ఎప్పుడైనా మీ Google ఖాతాల సెట్టింగ్‌ కు వెళ్లడం ద్వారా తొలగించవచ్చు, తద్వారా సదరు డేటా వినియోగానికి మీ సమ్మతిని ఉపసంహరించుకున్నట్లు అవుతుంది. అయితే, Google Pay దాని పార్ట్‌నర్‌ల ద్వారా సదరు డేటాను తొలగించడానికి ఎటువంటి బాధ్యత వహించదు. ఇంకా, డేటా తొలగింపు అనేది స్థానిక చట్టాలు, నియంత్రణలు లేదా చట్టపరమైన కారణాల ద్వారా అనుమతించబడిన దాని ప్రకారం మాత్రమే చేయబడుతుంది. దయచేసి Google తాలూకు తొలగింపు, పూర్తి తొలగింపు, నిల్వ కొనసాగింపు పాలసీల గురించి Google గోప్యతా పాలసీ లో మరింత చదివి తెలుసుకోండి.

సెక్యూరిటీ

వర్తించే చట్టాలకు అనుగుణంగా Google వ్యక్తిగత డేటాను (పాలసీ) ప్రకారం భద్రపరుస్తుంది.

23. మేధోసంపత్తి హక్కుల వినియోగం, రక్షణ

Google Pay సర్వీసులు కాపీరైట్, వ్యాపారచిహ్నాలు, పేటెంట్‌లు, ట్రేడ్ సీక్రెట్ మరియు/లేదా ఇతర మేధోసంపత్తి చట్టాల ద్వారా రక్షించబడ్డాయి. Google Pay సర్వీసులలోని టైటిల్, కాపీరైట్, ఇతర ప్రపంచవ్యాప్త మేధో సంపత్తి హక్కులను Google LLC కలిగి ఉంది. ఈ సంయుక్త Google Pay నియమాల వల్ల Google Pay సర్వీసులలోని మేధో సంపత్తి హక్కులపై మీకు ఎలాంటి హక్కులు మంజూరు చేయబడవు. Google లేదా దాని గ్రూప్ కంపెనీల మేధో సంపత్తి హక్కులను ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా వినియోగానికి, వర్తింపచేయడానికి, చొరబడడానికి లేదా ఏ విధమైన దుర్వినియోగానికి, లేదా అతిక్రమణకు ఇక్కడ ఉన్న ఏదీ యూజర్‌లకు అధికారం ఇవ్వదు. ఈ నియమాలతో మీ ఒప్పందానికి లోబడి Google Pay సర్వీసును ఉపయోగించడానికి మీకు ఇందుమూలంగా పరిమిత లైసెన్స్ అందించబడింది. మీరు వ్యాపారి అయి, BHIM UPI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మీ ఎండ్ యూజర్‌ల నుండి పేమెంట్‌లను ఆమోదించడానికి Google Payని ఉపయోగించాలనుకుంటే, Google Pay ట్రేడ్‌మార్క్‌లు, Google Pay లోగోలను ఉపయోగించడానికి మీకు గల పరిమిత హక్కు ఈ Google Pay బ్రాండ్ గైడ్‌లైన్స్ ప్రకారం ఉంటుంది.

మీరు Google Pay యాప్ ద్వారా లేదా దానికి ఫీడ్‌బ్యాక్ చేరి ఉన్న కంటెంట్‌ను అప్‌లోడ్ చేసినప్పుడు, సమర్పించినప్పుడు, స్టోర్ చేసినప్పుడు, పంపినప్పుడు లేదా స్వీకరించినప్పుడు, మీరు Google ఉపయోగించడానికి, హోస్ట్ చేయడానికి, స్టోర్ చేయడానికి, రీప్రొడ్యూస్ చేయడానికి, సవరించడానికి, (మీ కంటెంట్ Google Pay సర్వీసులతో మెరుగ్గా పనిచేసేలా మేము చేసే అనువాదాలు, అనుసరణలు ఇతర మార్పుల ద్వారా తయారయ్యే వాటితో సహా) ఉత్పన్నమైన కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి కమ్యూనికేట్ చేయడానికి, పబ్లిష్ చేయడానికి, పబ్లిక్‌గా అమలు చేయడానికి, పబ్లిక్‌గా ప్రదర్శించడానికి, అటువంటి కంటెంట్‌ను పంపిణీ చేయడానికి శాశ్వత ప్రపంచవ్యాప్త లైసెన్స్‌ను ఇస్తారు. Google దీనిని ఉపయోగించకపోయినప్పటికీ ఈ లైసెన్స్ మీకు తిరిగి రాదు. ఈ లైసెన్స్‌లో మీరు అందించే హక్కులు Google Pay సర్వీసుల ఆపరేటింగ్, ప్రమోటింగ్, మెరుగుపరచడం, కొత్త వాటిని అభివృద్ధి చేయడం వంటి పరిమిత ప్రయోజనం కోసం ఉద్దేశించినవి. Google Pay సర్వీసులు ఉపయోగించడాన్ని ఆపివేసినప్పటికీ ఈ లైసెన్స్ కొనసాగుతుంది.

24. ట్యాక్స్‌ల కోసం బాధ్యత

Google Pay సర్వీసులను ఉపయోగించడం వల్ల ఉత్పన్నమయ్యే ఏవైనా వర్తించే ట్యాక్స్‌లకు సంబంధించిన రిపోర్టింగ్, పేమెంట్ మీ బాధ్యత. Google Pay సర్వీసుల వినియోగానికి సంబంధించి, మీరు Google Pay సర్వీసుల ద్వారా చేసిన పేమెంట్‌లు లేదా పొందిన నిధులకు/ఆదాయానికి సంబంధించిన పన్నుల రిపోర్టింగ్, పేమెంట్‌తో సహా, వీటికే పరిమితం కాకుండా వర్తించే అన్ని పన్ను చట్టాలను మీరు ఖచ్చితంగా పాటిస్తారని దీని ద్వారా అంగీకరిస్తున్నారు

25. నష్ట పరిహారం

Google, దాని గ్రూప్ కంపెనీలు, పేమెంట్ పార్టిసిపెంట్‌లు, దాని, వారి డైరెక్టర్లు, అధికారులు, ఓనర్‌లు, ఏజెంట్లు, కో-బ్రాండర్లు, ఇతర పార్ట్‌నర్‌లు, ఉద్యోగులు, సమాచార ప్రొవైడర్‌లు, లైసెన్సర్‌లు, లైసెన్సీలు, కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్లు, ఇతర సంబంధిత థర్డ్-పార్టీలు (కలిసి "నష్టపరిహారం చెల్లించాల్సిన పార్టీలు") ఇందులో సహేతుకమైన న్యాయవాది ఫీజులతో పాటు దిగువున పేర్కొన్న వాటితో సహా, వీటికే పరిమితం కాకుండా వారిపై వచ్చే ఏవైనా క్లెయిమ్‌లు, డిమాండ్లు, దావా వేయడానికి గల కారణాలు, లోన్‌లు లేదా బాధ్యతల నుండి మీరు రక్షణ కల్పిస్తామని, వారికి ఎటువంటి హాని జరగకుండా చూస్తామని మీరు అంగీకరిస్తున్నారు:

(a) సర్వీసుల తాలూకు మీ వినియోగం;

(b) ఈ Google Pay నియమాలు లేదా ఏదైనా Google Pay పాలసీలకు సంబంధించిన ఏదైనా నియమాలను మీరు ఉల్లంఘించినా లేదా పాటించకపోయినా;

(c) మీ చర్యలు లేదా ఇబ్బందుల కారణంగా ఎదురైన ఏదైనా వివాదం లేదా దావా; లేదా

(d) మీ అశ్రద్ధ లేదా ఉల్లంఘన లేదా వర్తించే ఏదైనా చట్టం లేదా థర్డ్-పార్టీ తాలూకు హక్కుల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణ.

26. నిరాకరణ

సర్వీసులు, వాటితో పాటు మొత్తం కంటెంట్, సాఫ్ట్‌వేర్, ఫంక్షన్‌లు, మెటీరియల్స్‌తో సహా, సర్వీసులకు సంబంధించి అందించబడిన లేదా వాటి ద్వారా యాక్సెస్ చేయబడే సమాచారం "ఉన్నవి ఉన్నట్లుగా" అందించబడతాయి. సర్వీసులకు సంబంధించి, లేదా సర్వీసుల్లో ఉపయోగించబడే లేదా వాటి ద్వారా యాక్సెస్ చేయబడే సాఫ్ట్‌వేర్ ద్వారా అందుబాటులో ఉంచబడిన కంటెంట్, మెటీరియల్స్, సమాచారం, ఫంక్షన్‌లకు సంబంధించి, లేదా సర్వీసుల ద్వారా గోప్యమైన సమాచారం ప్రసారానికి సంబంధించిన ఏదైనా సెక్యూరిటీ ఉల్లంఘన కోసం కూడా చట్టం ద్వారా అనుమతించబడిన పూర్తి స్థాయిలో, GOOGLE, గ్రూప్ కంపెనీలు, వారి ఏజెంట్లు, సహ-బ్రాండర్‌లు లేదా ఇతర పార్ట్‌నర్‌లతో సహా, కానీ వీరికే పరిమితం కాకుండా పరికరాల తయారీదారులు (సమిష్టిగా "GOOGLE పార్టీలు") ఎలాంటి ప్రాతినిధ్యం వహించరు లేదా వారంటీ ఇవ్వరు. ప్రతి GOOGLE పార్టీ, పరిమితి లేకుండా, సర్వీసులకు సంబంధించి, ఉల్లంఘన లేకపోవడం, వ్యాపార యోగ్యత లేదా నిర్దిష్ట ప్రయోజనం కోసం అనుకూలతతో సహా, ఎలాంటి వారంటీని నిరాకరిస్తుంది. సర్వీసుల్లో ఉండే ఫంక్షన్‌లు నిరంతరాయంగా లేదా ఎర్రర్ లేకుండా ఉంటాయని GOOGLE వారంట్ చేయదు. పేమెంట్ లావాదేవీలు, P2P పేమెంట్‌లు లేదా సర్వీసుల స్వీకరణ, ప్రాసెసింగ్, ఆమోదం, పూర్తి చేయడం లేదా సెటిల్‌మెంట్‌పై ప్రభావం చూపించే సిస్టమ్ వైఫల్యాలు లేదా ఇతర అంతరాయాలతో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా, ఏదైనా సర్వీసు అంతరాయాలకు GOOGLE బాధ్యత వహించదు.

ఏ పేమెంట్ ఆప్షన్ తాలూకు ఖచ్చితత్వానికి గానీ, సదరు సమాచారం ప్రస్తుతం, అప్‌డేట్ అయ్యిందా లేదా అనే దానితో సహా, వీటికే పరిమితం కాకుండా ఏ విషయానికైనా గానీ GOOGLE పార్టీలు బాధ్యత వహించవు. మునుపటి వాక్యపు సాధారణతను పరిమితం చేయకుండా, సదరు సమాచారం జారీ చేసే సంస్థ నిర్ణయించిన సమయానికి జారీ చేసే సంస్థ రిపోర్ట్ చేసిన సమాచారం మీ ప్రస్తుత లావాదేవీలను అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌ను లేదా సర్వీసుల ద్వారా మీకు ప్రదర్శించబడే సమయంలో లేదా మీరు కొనుగోలు లేదా రిడెంప్షన్ చేసే సమయంలో ఇతర ఖాతా లేదా ప్రోగ్రామ్ వివరాలను ఖచ్చితంగా ప్రతిబింబించకపోవచ్చని మీరు స్పష్టంగా అంగీకరిస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. మీరు మీ జారీ చేసే సంస్థతో మీ ఒప్పందం ప్రకారం, ఓవర్‌డ్రాఫ్ట్ ఫీజులు లేదా సదరు లావాదేవీల ఫలితంగా ఇతర ఛార్జీలు మీకు విధించబడవచ్చు, లేదా కొనుగోలు లేదా రిడెంప్షన్ చేయడానికి మీ ప్రయత్నం విజయవంతం కాకపోవచ్చు.

27. చట్టపరమైన బాధ్యత పరిమితి; ఊహించని సంఘటన

లాభాల నష్టం, గుడ్‌విల్, వినియోగం, డేటా నష్టం లేదా ఇతర అస్పష్టమైన నష్టాలతో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా, ఏ GOOGLE పార్టీకి లేదా సర్వీసులకు సంబంధించి సంభవించిన, లేదా సర్వీసుల ద్వారా కొనుగోలు చేయబడిన, స్వీకరించబడిన, విక్రయించబడిన లేదా చెల్లించబడిన ఏవైనా వస్తువులు, సర్వీసులు లేదా సమాచారం కోసం, దావా రకం లేదా దావా వేయడానికి గల కారణంతో సంబంధం లేకుండా, GOOGLE పార్టీకి అటువంటి హాని లేదా నష్టం యొక్క సంభావ్యత గురించి తెలియజేయబడినా కూడా ఏ సందర్భంలోనైనా GOOGLE గానీ లేదా దాని గ్రూప్ కంపెనీలు గానీ మీకు లేదా ఏదైనా థర్డ్-పార్టీకి ఏదైనా ఏ విధమైన పరోక్ష, పరిణామ, ప్రత్యేక, శిక్షాత్మక లేదా ఉదాహరణాత్మక నష్టాలకు లేదా హానికి, ఏ పరిస్థితులలోనైనా బాధ్యులు కారు లేదా మీకు బాధ్యత వహించవు. ఏ సందర్భంలోనూ, ఈ సంయుక్త Google Pay నియమాల నుండి ఉత్పన్నమయ్యే లేదా వాటికి సంబంధించిన GOOGLE పార్టీల మొత్తం సంచిత బాధ్యత అనేది, దావా తేదీకి వెంటనే ముందున్న మూడు నెలల వ్యవధిలో మీ చెల్లుబాటు అయ్యే లావాదేవీల నుండి Google వాస్తవానికి స్వీకరించిన, మినహాయించిన నికర ఫీజులను మించదు.

(i) మరణం లేదా వ్యక్తిగత గాయం; (ii) మోసం; (iii) మోసపూరితంగా తప్పుదోవ పట్టించడం; లేదా (iv) చట్టం ద్వారా మినహాయించబడని లేదా పరిమితం చేయబడని ఏదైనా బాధ్యతకు సంబంధించి ఈ Google Pay నియమాలలో ఏదీ ఏ పార్టీ తాలూకు బాధ్యతను మినహాయించడానికి గానీ, పరిమితం చేయడానికి గానీ ఉద్దేశించబడలేదు.

ఇక్కడ పేర్కొన్న చట్టపరమైన బాధ్యత పరిమితులను నమ్ముతూనే ఇరు పార్టీలూ ఈ సంయుక్త Google Pay నియమాలలోకి ప్రవేశించాయని, ఆ పరిమితులు ఇరు పార్టీల మధ్య ఒప్పందానికి ప్రాథమిక ఆధారం అని మీరు, Google ఇద్దరూ ధృవీకరిస్తున్నారు. పైన పేర్కొన్న వాటికి అదనంగా, దానికి పరిమితి లేకుండా, ఏ Google పార్టీ అయినా కూడా తమ సహేతుకమైన నియంత్రణకు మించిన పరిస్థితుల వల్ల కలిగే ఏ విధమైన వైఫల్యం లేదా ఆలస్యానికి బాధ్యత వహించదు. ప్రభుత్వ చర్యలు, ఉగ్రవాద చర్యలు, భూకంపం, అగ్ని, వరదలు, దైవ ఘటనలు, కార్మిక పరిస్థితులు, విద్యుత్ వైఫల్యాలు, ఇంటర్నెట్ అంతరాయాలు వంటివి వాటితో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా అన్నీ ఈ పరిధిలోకి వస్తాయి.

28. ఉప సంహారం, తాత్కాలిక నిలిపివేత

ఇన్‌యాక్టివిటీ వల్ల గానీ, ఈ సంయుక్త Google Pay నియమాల లేదా మేము ఎప్పటికప్పుడు రూపొందించే ఇతర పాలసీల ఉల్లంఘనతో సహా, వీటికే పరిమితం కాకుండా ఏ కారణం చేతనైనా గానీ, మా స్వంత విచక్షణ మేరకు, మీకు లేదా ఏదైనా థర్డ్-పార్టీకి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, Google Pay సర్వీసులను సస్పెండ్ చేయడానికి లేదా రద్దు చేయడానికి మేము హక్కును కలిగి ఉంటాము.

29. అడ్వర్టయిజింగ్

కొన్ని Google Pay ఫీచర్‌లకు యాడ్ నికర ఆదాయం వస్తుంది, వాటిలో అడ్వర్టయిజ్‌మెంట్‌లు, ప్రమోషన్‌లు కనిపించవచ్చు. Google మీకు సర్వీసులను ఉపయోగించేందుకు యాక్సెస్‌ను, అనుమతి ఇచ్చినందుకు గాను, అడ్వర్టయిజింగ్‌ను, ప్రమోషన్‌లను Google ప్రదర్శించవచ్చని మీరు దీని ద్వారా అంగీకరిస్తున్నారు.

30. పాలక చట్టం; అధికారిక ప్రదేశం

Google Pay నియమాలు, Google Pay పాలసీలు భారతదేశ చట్టాలకు కట్టుబడి ఉంటాయి, వాటిని ఆ చట్టాలకు అన్వయించుకోవాలి. పైన పేర్కొన్న డాక్యుమెంట్‌లకు సంబంధించి ఏవైనా చట్టపరమైన చర్యలు లేదా దావాలు భారతదేశంలోని న్యూఢిల్లీలోని సంబంధిత కోర్టులలో మాత్రమే దాఖలు చేయబడవచ్చని, ఆ కోర్టుల అధికారిక ప్రదేశానికి తిరుగులేని విధంగా కట్టుబడి ఉంటాయని మీరు ఆమోదిస్తున్నారు. వర్తించే చట్టం, నియంత్రణ చట్టం, చట్టపరమైన ప్రక్రియ లేదా అమలు చేయదగిన ప్రభుత్వపరమైన రిక్వెస్ట్‌ను పూర్తి చేయడానికి, Google Payలో మీరు అందించిన సమాచారాన్ని మేము షేర్ చేయవలసి రావచ్చని మీరు అర్థం చేసుకుంటున్నారు.

31. సర్వీస్ నియమాల సవరణ

Google Pay సంయుక్త నియమాలలో ఏ భాగాన్నైనా మా స్వంత విచక్షణ మేరకు ఎప్పుడైనా మార్చడానికి, సవరణ చేయడానికి లేదా సరి చేయడానికి మాకు పూర్తి హక్కు ఉంది. ప్రారంభ పోస్టింగ్ తర్వాత మార్పులు పోస్ట్ చేసిన వెంటనే అమలులోకి వస్తాయి, వాటిని మీరు అంగీకరించినట్లుగా పరిగణించబడతాయి. ఈ మార్పులు పోస్టింగ్ తేదీ తర్వాత ప్రారంభించబడిన లావాదేవీలకు సంబంధించి, ఇకపై వర్తిస్తాయి. ఏదైనా మార్పు మీకు సమ్మతం కాకపోతే, మీకు ఉన్న ఏకైక నివారణోపాయం సర్వీసుల వినియోగాన్ని ఆపివేయడమే.

Google Pay యాప్‌ను లేదా సర్వీసులను (పూర్తిగా లేదా కొంత భాగం) ఎప్పుడైనా, తాత్కాలికంగా గానీ, శాశ్వతంగా గానీ మార్చడానికి లేదా నిలిపివేయడానికి మేము హక్కును కలిగి ఉంటాము. మేము ఈ మార్పులు చేసే ముందు మీకు నోటీసు ఇవ్వకపోవచ్చు. మా స్వంత విచక్షణ మేరకు, వర్తించే ఫీజులతో సహా సర్వీసులను కూడా మేము మార్చవచ్చు. మార్పులు మీకు సమ్మతం కాకపోతే, సర్వీసులను ఉపయోగించడం ఆపివేయడం మంచిది. మార్పు(లు) అమలులోకి వచ్చిన తర్వాత మీరు సర్వీసులను ఉపయోగిస్తే, ఆ మార్పు(ల)కు మీరు అంగీకారం తెలిపినట్లుగానే భావించబడుతుంది. సర్వీసులలో ఏవైనా మార్పులు చేసినా, వాటిని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేసినా, దానికి మీకు లేదా మరే ఇతర వ్యక్తికి మేము బాధ్యులం కాదని మీరు అంగీకరిస్తున్నారు.

32. ఇంగ్లీష్ భాషా కంట్రోల్స్

ఈ సంయుక్త Google Pay నియమాల అనువాదం ఏదైనా మీ సౌలభ్యం కోసం అందించబడింది. ఇక్కడ ఉన్న నియమాలు, షరతులు, వాగ్దానాల అర్థాలు ఇంగ్లీషు భాషలోని నిర్వచనాలకు, వివరణలకు లోబడి ఉంటాయి. అందించిన ఏదైనా అనువాదం ఒరిజినల్‌గా ఇంగ్లీష్ భాషలో ఉన్న సమాచారానికి ఖచ్చితంగా ప్రాతినిధ్యం వహించకపోవచ్చు.

33. అప్పగింత

ఈ సంయుక్త Google Pay నియమాలు, ఇక్కడ మంజూరు చేయబడిన ఏవైనా హక్కులు, లైసెన్స్‌లు మీ ద్వారా బదిలీ చేయబడవు లేదా కేటాయించబడవు. మేము ఈ ఒప్పందం తాలూకు ప్రయోజనాలను లేదా అనివార్యకార్యాలను పూర్తిగా లేదా పాక్షికంగా కేటాయించవచ్చు. మేము మీకు సదరు అప్పగింత గురించిన సమాచారాన్ని అందిస్తాము, ఈ నియమాలను, షరతులను పార్టీలు ఆచరించడం తప్పనిసరి అవుతుంది.

34. పరిత్యాగం

ఈ ఒప్పందంలో స్పష్టంగా మరో రకంగా పేర్కొన్నప్పుడు తప్ప, సంయుక్త Google Pay నియమాల ప్రకారం హక్కును లేదా నివారణోపాయాన్ని అమలు చేయడంలో వైఫల్యం లేదా ఆలస్యం అనేది ఆ హక్కు లేదా నివారణోపాయం తాలూకు పరిత్యాగాన్ని లేదా ఏదైనా ఇతర హక్కులు లేదా నివారణోపాయాల పరిత్యాగాన్ని సూచించదు, సంయుక్త Google Pay నియమాల ప్రకారం ఏదైనా హక్కు లేదా నివారణోపాయం తాలూకు ఒక్క లేదా పాక్షిక అమలు, ఆ హక్కు లేదా నివారణోపాయం తాలూకు తదుపరి అమలును లేదా ఏదైనా ఇతర హక్కు లేదా నివారణోపాయం తాలూకు అమలును నిరోధించదు.

35. నిబంధనల మనుగడ

సంయుక్త Google Pay నియమాల యొక్క నిబంధనలు, షరతులు, వాటి స్వభావం, కంటెంట్ ప్రకారం, ఈ ఒప్పందంలోని ఏ ఒక్క పార్టీ లేదా అన్ని పార్టీల పనితీరు పూర్తయినా లేదా ఒప్పందం రద్దు అయినా కూడా కొనసాగుతాయి.

36. వియోజనం

సంయుక్త Google Pay నియమాలలోని ఏదైనా నిబంధన ఒకవేళ పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లనిది లేదా అమలుపరచలేనిది అయినప్పటికీ, ఆ నిబంధనలో కొంత భాగాన్ని తొలగించినట్లయితే, అది చెల్లుబాటు అవుతుందనుకుంటే, అలా చెల్లుబాటు కావడానికి అవసరమైన తొలగింపులతో కలిపి ఆ నిబంధన వర్తిస్తుంది. సంబంధిత అధికారిక ప్రదేశపు ఏదైనా న్యాయస్థానం/ట్రిబ్యునల్ ఒకవేళ సంయుక్త Google Pay నియమాలలోని ఏదైనా నిబంధనలను చట్టవిరుద్ధమైనవని గానీ, ప్రభావశీలం కానివని గానీ పరిగణిస్తే, Google Pay ఆఫర్‌ల సంయుక్త నియమాల మిగతా భాగం పూర్తిగా అమల్లో ఉంటుంది, చట్టవిరుద్ధమైన లేదా వేరే విధంగా ప్రభావవంతం కాని నిబంధనను ఒక కొత్త ప్రత్యామ్నాయ నిబంధనతో భర్తీ చేస్తారు, అది సదరు భర్తీ చేయబడిన నిబంధన తాలూకు ఉద్దేశాన్ని ప్రతిబింబించేదిగా ఉంటుంది.

Google Pay నియమాల అనుబంధ డాక్యుమెంట్: భారతదేశ ప్రవాసుల కోసం Google Pay సర్వీస్ నియమాలు

1. పరిచయం

వర్తించే నియమాలు. భారతదేశ ప్రవాసుల కోసం ఈ Google Pay సర్వీస్ నియమాలు (“Google Pay ప్రవాస నియమాలు”) Google Pay నియమాల, లో భాగం అవుతాయి, వాటికి అనుబంధంగా ఉంటాయి, Google Payలో UPIని (“UPIలో NRE/NRO ఖాతాలు”) ఉపయోగించడానికి ఎంచుకునే అర్హత కలిగిన ప్రవాస యూజర్‌లకు (దిగువ నిర్వచించినట్లు) వర్తిస్తాయి. "ఈ Google Pay ప్రవాస నియమాలు, మిగిలిన Google Pay నియమాల మధ్య ఏదైనా వైరుధ్యం ఉంటే, UPIలో NRE/NRO ఖాతాల విషయంలో ఈ Google Pay ప్రవాస నియమాలు అమలవుతాయి."

అర్హత ఉన్న ప్రవాస యూజర్‌లు. విదేశీ మారక నిర్వహణ చట్టం, 1999 (“FEMA”)కు అనుగుణంగా ప్రవాస (బాహ్య) రూపాయి ఖాతాలను (“NRE ఖాతాలు”) లేదా సాధారణ రూపాయి ఖాతాలను (“NRO ఖాతాలు”) కలిగి ఉన్న ప్రవాస భారతీయులైన యూజర్‌లు (“NRIల”)కు అలాగే కింది దేశ కోడ్‌లలో ఏదైనా మొబైల్ నంబర్‌లు కలిగిన (“అర్హత గల ప్రవాస యూజర్‌ల”)కు UPIలో NRE/NRO ఖాతాలు అందుబాటులో ఉన్నాయి:

  • సింగపూర్ దేశం కోడ్ (+65).

వర్తించే చట్టానికి లోబడి, ఇతర దేశ కోడ్‌లతో మొబైల్ నంబర్‌లను కలిగి ఉన్న NRI యూజర్‌లకు UPIలో NRE/NRO ఖాతాలను, ఈ Google Pay ప్రవాస నియమాలను Google ఎప్పటికప్పుడు విస్తరించవచ్చు.

UPIలో NRE/NRO ఖాతాలను ఉపయోగించడానికి ఎంచుకునే అర్హత కలిగిన ప్రవాస యూజర్‌లు, ఈ Google Pay నియమాలతో సహా (వారు భారతదేశ నివాసులైనట్లే) సంయుక్త Google Pay నియమాలకు కట్టుబడి ఉంటారు, భారతదేశ ప్రవాసులయితే అనుబంధించబడిన ఈ Google Pay సర్వీస్ నియమాలకు కూడా కట్టుబడి ఉంటారు.

Google ఈ Google Pay ప్రవాస నియమాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే హక్కును కలిగి ఉంటుందని మీరు అర్థం చేసుకుంటున్నారు, అంగీకరిస్తున్నారు. "మీరు అప్‌డేట్ అయ్యి ఉంటున్నారని, Google Pay ప్రవాస నియమాలను, Google Pay ఆఫర్‌ల సంయుక్త నియమాలను తరచుగా చదువుతున్నారని నిర్ధారించుకోవాలి.

2. UPIలో NRE/NRO ఖాతాలను ఉపయోగించి లావాదేవీలు

లావాదేవీ పరిమితులు. UPI ద్వారా NRE/NRO ఖాతాలను ఉపయోగించి చేసే ప్రతి లావాదేవీ కనిష్ఠ, గరిష్ఠ లావాదేవీ పరిమితులకు లోబడి ఉంటుంది, ఇవి ఎప్పటికప్పుడు (i) FEMA కింద; మరియు/లేదా (ii) UPIకి సంబంధించి NPCI ద్వారా; మరియు/లేదా (iii) మీ NRE ఖాతా లేదా NRO ఖాతా (వర్తించే విధంగా) నిర్వహించబడుతున్న బ్యాంకు ద్వారా సూచించబడతాయి.

అనుమతించదగిన లావాదేవీలు. మీరు NRE/NRO ఖాతాలను UPIలో NRE ఖాతాలు లేదా NRO ఖాతాల (ఏది అయితే అది) కోసం FEMAతో సహా వర్తించే చట్టాలకు లోబడి అనుమతించబడిన లావాదేవీల కోసం మాత్రమే ఉపయోగించవచ్చు.

3. డిజేబుల్ చేయబడిన ఫీచర్‌లు

Google ఎప్పుడైనా, తన స్వంత విచక్షణ మేరకు, ముందస్తు నోటీసు లేకుండా Google Pay నుండి ఫీచర్‌లను మరియు/లేదా ఫంక్షనాలిటీని మరియు/లేదా UPIలో NRE/NRO ఖాతాలను ఉపసంహరించుకునే హక్కును కలిగి ఉంటుందని మీరు అర్థం చేసుకుని అంగీకరిస్తున్నారు. పర్యవసానంగా, UPIలో NRE/NRO ఖాతాల వినియోగాన్ని ఎంచుకున్న, అర్హతగల ప్రవాస యూజర్‌లకు సదరు ఫీచర్‌లకు/ఫంక్షనాలిటీకి సంబంధించి Google Pay నియమాలలోని సంబంధిత నిబంధనలు వర్తించవు.

ఉదాహరణకు, UPIలో NRE/NRO ఖాతాలను ఉపయోగించడాన్ని ఎంచుకున్న అర్హతగల ప్రవాస యూజర్‌లకు సంబంధించి కింది Google Pay ఫీచర్‌లు డిజేబుల్ చేయబడ్డాయి:

(a) అర్హత కలిగిన ప్రవాస యూజర్‌లకు ఫోన్‌బుక్ యాక్సెస్ ప్రాంప్ట్ చేయబడదు, సదరు అర్హత కలిగిన ప్రవాస యూజర్‌లకు Google Pay యాప్‌లో ఏ ఫోన్‌బుక్ కాంటాక్ట్ సమాచారమూ కనిపించదు.

(b) అర్హత కలిగిన ప్రవాస యూజర్‌లు Google Payలో లోన్ సదుపాయం సర్వీసులను లేదా ఇతర ఆర్థిక సర్వీస్ ప్రోడక్ట్‌లను పొందేందుకు అనుమతించబడరు.

(c) అర్హత కలిగిన ప్రవాస యూజర్‌లు అంతర్జాతీయ పేమెంట్‌ల కోసం పేమెంట్ ఆప్షన్‌లను జోడించడానికి అనుమతించబడరు.

(d) వర్చువల్ ఖాతా నంబర్‌ను క్రియేట్ చేయడం ద్వారా Google Payతో క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను టోకెనైజ్ చేయడానికి అర్హత కలిగిన ప్రవాస యూజర్‌లు అనుమతించబడరు.

(e) అర్హత కలిగిన ప్రవాస యూజర్‌లు FEMA ప్రకారం భారతదేశం వెలుపల నివసించే వ్యక్తుల కోసం NRE ఖాతాల మధ్య అలాగే ఇతర అనుమతించదగిన ఖాతాల మధ్య నిధులను బదిలీ చేయడానికి అనుమతించబడరు.

(f) Google Pay కస్టమర్‌గా NRE ఖాతాలను లేదా NRO ఖాతాలను ఉపయోగించి అర్హత కలిగిన ప్రవాస యూజర్‌లను రెఫర్ చేసినందుకు గాను ఏ యూజర్‌కూ క్యాష్‌బ్యాక్ రివార్డ్‌లు గానీ, స్క్రాచ్ కార్డ్‌లు గానీ లభించవు. అదేవిధంగా, NRE ఖాతాలను గానీ NRO ఖాతాలను గానీ ఉపయోగించే అర్హత కలిగిన ప్రవాస యూజర్‌లు కూడా రెఫరల్ క్యాష్-బ్యాక్ రివార్డ్‌లను లేదా స్క్రాచ్ కార్డ్‌లను స్వీకరించడానికి అర్హులు కారు.

(g) NRE ఖాతాలను లేదా NRO ఖాతాలను ఉపయోగించే అర్హత కలిగిన ప్రవాస యూజర్‌లు ఇతర GPay యూజర్‌ల నుండి పేమెంట్‌లను స్వీకరించడానికి గానీ లేదా కలెక్ట్ చేసుకోవడానికి గానీ కలెక్ట్ రిక్వెస్ట్‌లను ట్రిగ్గర్ చేయడానికి అనుమతించబడరు.

(h) Google Payలో RuPay క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయడానికి అర్హత కలిగిన ప్రవాస యూజర్‌లు అనుమతించబడరు.

(i) అర్హత కలిగిన ప్రవాస యూజర్‌లు వారి UPI IDలను వారి ఫోన్ నంబర్‌లకు లింక్ చేయడానికి అనుమతించబడరు.